News March 21, 2025

జనగామ: పదో తరగతి విద్యార్థులకు ‘విజయోస్తు’

image

రేపు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయబోతున్న జనగామ జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ‘విజయోస్తు’ అని గురువారం ఒక ప్రకటనలో ఆశీర్వదించారు. ప్రశాంత మనసుతో పరీక్షను ఎదుర్కోవాలని, చక్కగా రాసి మంచి ఫలితాలు సాధించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తేవాలని పేర్కొన్నారు. ఈ ఏడాది రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో జిల్లాను నిలబెట్టాలని కోరారు.

Similar News

News October 21, 2025

జనగామ: కార్యాలయం ఉన్నా.. చేయూత సున్నా!

image

యువతలోని నైపుణ్యాలను పెంపొందించి వారి అభివృద్ధికి తోడ్పాటు అందించాల్సిన యువజన కార్యాలయాలు నిర్వీర్యమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో యువజన కార్యక్రమాల నిర్వహణ కరవైంది. జనగామ జిల్లాలో 1,89,000 మంది యువత ఉన్నప్పటికీ స్థానిక యువతకు మాత్రం సంబంధిత శాఖ నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడం గమనార్హం.

News October 21, 2025

జనగామ జిల్లాలో 4.2 మి.మీ. వర్షపాతం

image

జనగామ జిల్లాలో గడచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు మండలాల వారీగా ఇలా ఉన్నాయి. తరిగొప్పుల 3.2 మి.మీ., చిల్పూర్ 2.0, జఫర్గడ్ 7.6, స్టేషన్‌ఘన్పూర్ 2.8, రఘునాథపల్లి 9.6, నర్మెట 1.6, జనగామ 3.4, లింగాల ఘనపూర్ 2.0, దేవరుప్పుల 12.2, కొడకండ్ల 6.0, మొత్తం 4.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

News October 21, 2025

ప్రకృతి గీసిన ‘నిడిగొండ’ చిత్రం

image

నీలి మేఘాల కింద కారుమబ్బులు అలుముకొని, అస్తమిస్తున్న సూర్యుడికి వాహనాల వెలుగులు దారి చూపుతున్నట్లు ఎంతో అద్భుతంగా ప్రకృతి గీసిన ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంటోంది. రఘునాథ్ పల్లి మండలం నిడిగొండలో సోమవారం సాయంత్రం ఈ చిత్రం ఆవిష్కృతమైంది. స్థానికుడైన వెంకటేష్ తన ఫోన్లో బంధించి Way2Newsతో ఈ చిత్రాన్ని పంచుకున్నాడు.