News March 21, 2025

మెదక్: వైద్య సేవల బలోపేతానికి ప్రణాళిక: మంత్రి

image

ప్రభుత్వ హాస్పిటళ్లలో అధునాతన సౌకర్యాల కల్పనకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ‌ అన్నారు‌. ఆసుపత్రులలో వైద్య సేవల బలోపేతానికి సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కార్యాలయంలో వైద్య ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల పై ప్రజలకు నమ్మకం కలిగేలా బ్రాండింగ్ చేయాలని మంత్రి అధికారులకు ఆదేశించారు.

Similar News

News July 8, 2025

మెదక్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం

image

మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణికి 11 దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులకు సూచించారు. సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2025

మెదక్: పదోన్నతుల ప్రక్రియ చేపట్టాలి: టీపీటీఎఫ్

image

బదిలీలతోపాటు పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. మెదక్‌లోని ఉపాధ్యాయ భవన్‌లో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, నగదు రహిత వైద్యం అందించాలని, పెండింగ్‌లో ఉన్న 4విడతల డీఏను విడుదల చేయాలన్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్ రాంరెడ్డి, మాజీ అధ్యక్షుడు కొండల్ రెడ్డి ఉన్నారు.

News July 7, 2025

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ ఎస్ఈగా నారాయణ నాయక్

image

మెదక్ జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)గా నారాయణ నాయక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా విద్యుత్తు శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వహించిన శంకర్ గత నెలలో ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్న నారాయణ నాయక్ నియమితులయ్యారు.