News March 21, 2025

ADB: BC స్టడీ సర్కిల్ ఘనత.. గ్రూప్స్‌లో సత్తాచాటిన 25 మంది

image

ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లోమంచి మార్కులు సాధించిన వారిని అభినందించారు. గ్రూప్-1 లో ఏడుగురు, గ్రూప్ 2లో 15 మంది, గ్రూప్-3 లో ఐదుగురు మంచి మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్‌లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.

Similar News

News March 22, 2025

ఆదిలాబాద్‌: ఈ నెల 24న JOB MELA

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్‌లో ఈ నెల 24న TSKC ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, TSKC కోఆర్డినేటర్ డా.శ్రావణి, ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మంజుల తెలిపారు. HDFC Bank & Axis Bankలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ ఉండి 30ఏళ్లలోపు వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.

News March 22, 2025

ADB: హమాలీల సమస్యలు, లైసెన్స్‌లపై కలెక్టర్ సమీక్ష

image

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో హమాలీల సమస్యలు, లైసెన్స్‌లపై శుక్రవారం కలెక్టర్ రాజర్షి షా సమావేశం నిర్వహించి కమిటీతో చర్చించారు. వ్యవసాయ కమిటీల్లో హమాలీలకు కొత్తగా లైసెన్సులు ఇచ్చేందుకు జిల్లా స్థాయి సమీక్షా నిర్వహించారు. హమాలీ లైసెన్సులు జారీ చేసేందుకు పేపర్ ప్రకటన ద్వారా దరఖాస్తులు స్వీకరించి ఎంపిక ప్రక్రియను మార్చి చివరిలోగా పూర్తి చేయాలని వ్యవసాయ కమిటీల అధికారులను ఆదేశించారు.

News March 22, 2025

రాష్ట్రపతి అల్పాహార విందుకు ఎంపీ నగేష్

image

రాష్ట్ర పతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో కల్చరల్ సెంటర్‌‌లో ఏర్పాటు చేసిన అల్పాహార విందుకు శుక్రవారం ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేశ్ హాజరయ్యారు. తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులు, ఒడిశా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, గోవా అండమాన్, నికోబార్ దీవులు, దాద్రా& నగర్ హవేలీ, డామన్ & డయ్యూ, లక్షద్వీప్ ఇతర రాష్ట్రాల కీలక అంశాలపై చర్చించారు.

error: Content is protected !!