News March 21, 2025
నారాయణపేట: కట్టుకున్నోడే కడ తేర్చాడు..!

నారాయణపేటలో కట్టుకున్న <<15830492>>భార్యను గొంతు నులిమి<<>> భర్త హత్య చేసిన విషయం తెలిసిందే. ఇన్‌ఛార్జ్ సీఐ రాజేందర్ రెడ్డి తెలిపిన వివరాలు.. నారాయణపేట మండలం డ్రైవర్ గోపి తండాకు చెందిన శారుభాయి(20), వినోద్ నాయక్ భార్యాభర్తలు. భార్య తనకు ఇష్టం లేదని నిత్యం వినోద్ గొడవ పడేవాడు. ఇష్టం లేని పెళ్లి చేశారంటూ వేధించేవాడు. ఈ క్రమంలో హత్య చేశాడు. 20 ఏళ్లకే శారుభాయి జీవితం ముగిసిందంటూ కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News March 22, 2025
KMR: ప్రేమ పేరుతో వివాహం.. కుల వివక్షతతో పారిపోయిన భర్త

లింగంపేట్ మండలం కొమాట్‌పల్లికి చెందిన నెల్లూరి భాగ్య అదే గ్రామానికి చెందిన చిటురి రాకేశ్ ప్రేమ వివాహం చేసుకుని కడుపులో బిడ్డను చంపి అన్యాయం చేశాడని బాధితురాలు ఆరోపించింది. రోడ్డుపై వదిలేసి వెళ్లిపోడంటూ.. భర్త ఇంటి ఎదుట శుక్రవారం భార్య ఆందోళనకు దిగింది. 2023లో యాదగిరి గుట్టలో ప్రేమవివాహం చేసుకోని, మోసం చేసి పారిపోయాడని వాపోయింది. తనకు న్యాయం చేయాలని కుటుంబ సభ్యులతో ఆందోళన చేపట్టింది.
News March 22, 2025
వనపర్తి: ప్రతి ఒక్క దివ్యాంగుడికి యూనిక్ డిజేబుల్ ఐడీ: కలెక్టర్

ప్రతి ఒక్క దివ్యాంగుడికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కార్డు ఉండాలని ప్రభుత్వం యూనిక్ డిజేబుల్ ఐడీని అమల్లోకి తీసుకొచ్చిందని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో యూనిక్ డిజేబుల్ ఐడీ అంశంపై ఎంపీడీవోలు, మీసేవ ఆపరేటర్లకు అవగాహన సమావేశం నిర్వహించారు. యూడీఐడీ కార్డు కోసం దివ్యాంగులు ఆన్లైన్ (www.swavlambancard.gov.in) ద్వారా అప్లై చేసుకోవాలన్నారు.
News March 22, 2025
గద్వాల: ‘ఎవరైనా వేధిస్తే మాకు చెప్పండి’

గద్వాల మండలం గోనుపాడు గ్రామంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో షీటీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డీఎస్పీ మొగలయ్య హాజరై ప్రసంగించారు. షీటీం సేవల గురించి, వేధింపులకు గురైనప్పుడు షీటీంను సంప్రదించాల్సిన ఆవశ్యకత, విద్య ప్రాముఖ్యత తెలియజేశారు. మహిళలు తమ కాళ్లపై తాము ఆర్థికంగా నిలబడాలన్నారు.