News March 21, 2025
తిరుపతిలో 248 మందికి సబ్సిడీ రుణాలు

తిరుపతి పార్లమెంట్ పరిధిలో పీఎం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పథకం అమలుపై కేంద్ర మంత్రిని ఎంపీ గురుమూర్తి పార్లమెంట్‌లో ప్రశ్నించారు. కేంద్ర ఆహార పరిశ్రమల శాఖ సహాయ మంత్రి రావ్నీత్ సింగ్ సమాధానం ఇస్తూ… తిరుపతి పార్లమెంట్ పరిధిలో 248 మంది లబ్ధిదారులకు రూ.8.09 కోట్లు సబ్సిడీ రుణాలు మంజూరు చేసినట్లు ప్రకటించారు.
Similar News
News November 8, 2025
మందమర్రి: 16న డిపెండెంట్లకు పోస్టింగ్ ఆర్డర్స్

సింగరేణిలో మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు ఈ నెల 16న ఉద్యోగ నియామక పత్రాలు అందించేందుకు యాజమాన్యం అంగీకరించిందని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ అధ్యక్ష కార్యదర్శులు సీతారామయ్య, రాజ్ కుమార్ శుక్రవారం తెలిపారు. దాదాపు 473 మంది డిపెండెంట్లకు కొత్తగూడెంలో పోస్టింగ్ ఆర్డర్స్ అందజేస్తారని పేర్కొన్నారు. ఏడు నెలలుగా నిలిచిన మెడికల్ బోర్డును ఈ నెలాఖరు లోపు నిర్వహించేందుకు యాజమాన్యం అంగీకరించిందన్నారు.
News November 8, 2025
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.
News November 8, 2025
GNT: పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జనవరిలో జరిగిన పలు పీజీ కోర్సుల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం తెలిపారు. ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ ప్రథమ, ద్వితీయ, నాలుగో సెమిస్టర్, జులైలో జరిగిన బీటెక్ ప్రధమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్ ఫలితాలు ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.


