News March 21, 2025
అవి తీసుకురాకండి: వనపర్తి జిల్లా కలెక్టర్

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఉదయం 8:30 గంటల్లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. విద్యార్థులు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు. పరీక్షకు వచ్చే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలని, స్మార్ట్ వాచ్‌లు, మొబైల్ ఫోన్లు వంటివి తీసుకురావద్దని సూచించారు.
Similar News
News March 22, 2025
ఒంగోలు: క్రికెట్ బెట్టింగ్స్‌తో జీవితాలు నాశనం చేసుకోవద్దు: ఎస్పీ

క్రికెట్ బెట్టింగుల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రకాశం ఎస్పీ ఏఆర్ దామోదర్ సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో క్రికెట్ బెట్టింగుల నిర్వాహకులు, పందెపు రాయుళ్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. క్రికెట్ బెట్టింగులకు పాల్పడినా, నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. యువత బెట్టింగుల జోలికి వెళ్లకుండా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతామన్నారు.
News March 22, 2025
జిల్లాలో రక్తహీనత తగ్గింది: కేంద్ర బృందం

రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పలు పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేస్తున్న కారణంగానే జిల్లాలో రక్తహీనత తగ్గిందని జిల్లాలో పర్యటించిన కేంద్ర ప్రభుత్వ వైద్య నిపుణుల బృందం అభిప్రాయపడింది. కలెక్టర్ అంబేడ్కర్‌ను కేంద్ర బృంద ప్రతినిధులు శుక్రవారం కలిశారు. జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటించిన తర్వాత గుర్తించిన అంశాలను కలెక్టర్‌కు వివరించారు.
News March 22, 2025
వాహన ధరలను పెంచనున్న మహీంద్రా

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తమ కంపెనీ వాహన ధరలను 3శాతం పెంచనున్నట్లు తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చులు కమోడిటీ ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ధరలు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే మారుతి సుజుకీ ఇండియా, హ్యుందాయ్, టాటా, కియా ఇండియా, సంస్థలు వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.