News March 21, 2025
ఆక్రమణదారులను కీర్తిస్తే దేశద్రోహమే: యోగి ఆదిత్యనాథ్

ఆక్రమణదారులను కీర్తించడం దేశద్రోహమే అవుతుందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. నాగ్‌పూర్ ఘటనలో కొంతమంది వ్యక్తులు ఔరంగజేబుకు మద్దతుగా వ్యాఖ్యానించడాన్ని యోగి ఖండించారు. ఇది న్యూ ఇండియా అని మన నాగరికత, సంస్కృతి, మహిళలపై దాడి చేసిన వారిని పొగిడితే ఒప్పుకోమని అన్నారు. మన దేశంపై దాడి చేసిన వారిని కీర్తించడం సరికాదని హితవు పలికారు.
Similar News
News December 28, 2025
కోటీశ్వరుడు.. ర్యాపిడో డ్రైవరయ్యాడు

కరోనా కష్టాలు ఒక కోటీశ్వరుడిని ర్యాపిడో డ్రైవర్‌గా మార్చేశాయి. ఒకప్పుడు ₹కోట్లలో వ్యాపారం చేసిన ఆయన కొవిడ్ వల్ల ఏకంగా ₹14 కోట్లు నష్టపోయారు. చేతిలో చిల్లిగవ్వ లేక ఉపాధి కోసం ర్యాపిడో నడుపుతున్నారు. Amity యూనివర్సిటీలో చదివిన అతడు ఒక ప్రయాణికుడితో తన బాధ పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్న కథ నెట్టింట వైరలవుతోంది. ‘ఇప్పటికీ దేవుడిపై నమ్మకం ఉంది. ఓటమిని ఒప్పుకోను’ అంటున్న ఆయన ధైర్యం కదిలిస్తోంది.
News December 28, 2025
Silver.. సారీ..! Stock లేదు!

వెండి పరుగులతో పెట్టుబడి కోసం బిస్కెట్స్‌కు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. కానీ కొందామని షాపులకు వెళ్తున్న కస్టమర్లకు నిరాశే ఎదురవుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ షాపుల్లో సిల్వర్ బార్స్ లేవనే సమాధానం వస్తోంది. ఒకవేళ అక్కడక్కడా ఉన్నా 10గ్రా, 15g, 20g బార్స్ తప్ప వందలు, వేల గ్రాముల్లో లేవని చెబుతున్నారు. ఆర్డర్ పెడితే 4-7 రోజులకు వస్తుందని, ఆరోజు ధరకే ఇస్తామంటున్నారు. మీకూ ఇలా అయిందా? కామెంట్.
News December 28, 2025
EDలో 75పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

డైరెక్టరేట్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంట్(<


