News March 21, 2025

డీలిమిటేషన్ సదస్సుకు హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు

image

ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటేషన్‌ సదస్సుకు కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. డీఎంకే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పాల్గొననున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 22, 2025

త్వరలో తెలంగాణ భవన్ నిర్మాణానికి శంకుస్థాపన: జితేందర్ రెడ్డి

image

ఢిల్లీలో నిర్మించనున్న నూతన తెలంగాణ భవన్ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండబోతుందని రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి జితేందర్ రెడ్డి అన్నారు. అధికారులతో కలిసి ఆయన భవన నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. తెలంగాణ భవన్‌కు సంబంధించిన డిజైన్‌కు సీఎం అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి నాలుగేళ్లలో పూర్తి చేస్తామని జితేందర్ రెడ్డి తెలిపారు.

News March 22, 2025

వాహన ధరలను పెంచనున్న మహీంద్రా

image

ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా తమ కంపెనీ వాహన ధరలను 3శాతం పెంచనున్నట్లు తెలిపింది. ఇన్‌పుట్ ఖర్చులు కమోడిటీ ధరలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ ధరలు వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానున్నాయి. అయితే ఇప్పటికే మారుతి సుజుకీ ఇండియా, హ్యుందాయ్, టాటా, కియా ఇండియా, సంస్థలు వాహనాల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.

News March 22, 2025

సినిమా నటులకు పాడు సంపాదన ఎందుకు? నారాయణ

image

సినిమా నటులకు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల ద్వారా వచ్చే పాడు సంపాదన ఎందుకని సీపీఐ జనరల్ సెక్రటరీ నారాయణ ప్రశ్నించారు. సినిమాల ద్వారా వచ్చిన గుర్తింపును తప్పుడు పనులకు దుర్వినియోగం చేయోద్దని హితవు పలికారు. గతంలో చిరంజీవి కోకాకోలా యాడ్ ఇచ్చేవారని అయితే రక్తదానం చేస్తూ రక్తాన్ని దెబ్బతీసే డ్రింక్‌లను ఎలా ప్రమోట్ చేస్తారని ప్రశ్నించానని తెలిపారు. ఆ తర్వాత అటువంటి చేయనని చిరంజీవి తనతో చెప్పారన్నారు.

error: Content is protected !!