News March 21, 2025

అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు: మంత్రి

image

TG: రాష్ట్రంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ప్రారంభించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనుండగా 31న హైటెక్స్‌లో ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. మెుత్తంగా 21 ప్రదేశాల్లో 23థీమ్‌లతో ఈవెంట్ నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నారు. మే7నుంచి31వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

Similar News

News November 5, 2025

బైకులకు టోల్ ట్యాక్స్ ఎందుకుండదో తెలుసా?

image

నేషనల్ హైవేస్ టోల్ రూల్స్ 2008 రూల్ 4(4) ప్రకారం టూవీలర్స్‌ టోల్ ట్యాక్స్ కట్టక్కర్లేదు. కార్లు, హెవీ వెహికల్స్‌తో పోలిస్తే బైకులతో రోడ్లు ఎక్కువ డ్యామేజ్ కావు. బండి కొనేటప్పుడే రోడ్ ట్యాక్స్ కడతాం. దానినే పరోక్షంగా రోడ్లు, హైవేల నిర్వహణకు వాడతారు. బైక్‌పై టోల్ ట్యాక్స్ వేస్తే ఆదాయం కంటే.. డబ్బు వసూలు చేయడానికే ఎక్కువ ఖర్చవుతుంది. అంతకు మించి అన్ని టోల్స్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది.

News November 5, 2025

పెరటి కోళ్లు-నాటు కోళ్ల పెంపకం.. ఏది బెస్ట్?

image

వనశ్రీ, రాజశ్రీ కోళ్లు 6 నెలల్లో 2.5- 3 KGల బరువు పెరుగుతాయి. నాటుకోళ్లు ఇదే సమయంలో 1.5 KGల బరువే పెరుగుతాయి. పెరటి కోళ్లు 150 నుంచి 160 రోజుల్లో తొలిసారి గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు 200 రోజుల తర్వాతే గుడ్లు పెడతాయి. పెరటి కోళ్లు ఏడాదికి 150-180 గుడ్లు పెడతాయి. నాటుకోళ్లు ఏడాదికి 50- 60 గుడ్లే పెడతాయి. అందుకే పెరటికోళ్ల ఆరోగ్యం, మేతలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఆదాయం పొందవచ్చంటున్నారు నిపుణులు.

News November 5, 2025

ట్రంప్ పార్టీ ఓటమి

image

అమెరికాలో ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి షాక్ తగిలింది. వర్జీనియా ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి సీయర్స్ ఓటమి పాలయ్యారు. డెమొక్రాట్ అభ్యర్థి అబిగైల్ స్పాన్‌బర్గర్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అబిగైల్‌కు 14.80 లక్షల ఓట్లు పోలవ్వగా, సీయర్స్‌కు 11.61 లక్షల ఓట్లు వచ్చాయి. దీంతో 3.20 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. వర్జీనియా చరిత్రలో తొలి మహిళా గవర్నర్ అబిగైలే కావడం విశేషం.