News March 21, 2025
NTR: మిషన్ వాత్సల్యపై జిల్లా స్థాయి సమీక్ష

కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన గురువారం విజయవాడ కలెక్టరేట్‌లో మిషన్ వాత్సల్య – శిశు సంక్షేమ, రక్షణ జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. మిషన్ వాత్సల్య లక్ష్యాలు, జిల్లాలో వాటి అమలు పురోగతిపై చర్చించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. శిశు సంరక్షణ చట్టాల అమలు, కుటుంబ ఆధారిత సంరక్షణ, ఆర్థిక సహకారం, బాలల హక్కుల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. కమిటీలు ప్రతి 15 రోజులకు సమావేశం కావాలన్నారు.
Similar News
News March 31, 2025
వనపర్తి: కొడుకు మృతి తట్టుకోలేక.. తండ్రి ఆత్మహత్య

కుమారుడి మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన గోపాల్‌పేట మండలంలో జరిగింది. గ్రామస్థుల వివరాలు.. బుద్దారానికి చెందిన కోదండరాములు(55) కుమారుడు ఆంజనేయులు భార్యతో గొడవలు, ఇంటి సమస్యల కారణంగా ఇటీవల ఇంట్లో ఉరేసుకున్నాడు. కోదండరాములు చిన్న కొడుకు సైతం ఏడాది క్రితం అనారోగ్యానికి గురై మృతిచెందాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తండ్రి శనివారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 31, 2025
RJY: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు వారు పేర్కొన్నారు.
News March 31, 2025
❤️ఇది కదా సక్సెస్ అంటే..!

నిన్న CSKపై RR ఘన విజయం సాధించింది. కెప్టెన్ రియాన్ పరాగ్ కెప్టెన్సీలో ఆ జట్టుకు ఇది తొలి గెలుపు. తన అభిమాన క్రికెటర్ ఎంఎస్ ధోనీ ప్రాతినిధ్యం వహిస్తున్న CSKను పరాగ్ ఓడించడం విశేషం. ఈ క్రమంలో ధోనీతో కలిసి దిగిన చిన్నప్పటి పరాగ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ఆరాధ్య క్రికెటర్‌తో పోటీపడి ఆ జట్టును ఓడించడం కంటే సక్సెస్ ఏముంటుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.