News March 24, 2024
ఉమ్మడి విశాఖలో మరో ఇద్దరికి జనసేన సీట్లు

ఉమ్మడి విశాఖలోని మరో 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే అనకాపల్లి సీటు కొణతాల రామకృష్ణకు ఇవ్వగా.. పెందుర్తి పంచకర్ల రమేశ్ బాబు, యలమంచిలి అభ్యర్థిగా సుందరపు విజయ్ కుమార్ పోటీలో ఉండనున్నారు. అటు విశాఖ వెస్ట్ వంశీ కృష్ణ యాదవ్‌కు ఇస్తారని వార్తలొచ్చినప్పటికీ ఈ జాబితాలో అతని పేరు లేదు. ఉమ్మడి విశాఖలో విశాఖ నార్త్, సౌత్, పాడేరు, భీమిలిలో కూటమి అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
Similar News
News March 2, 2026
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్ష

జిల్లావ్యాప్తంగా సోమవారం జరిగిన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ పరీక్షలు శాంతియుతంగా ముగిశాయని DEO ఎన్. ప్రేమకుమార్ తెలిపారు. మొత్తం 972 మంది అభ్యర్థులకు గాను 884 మంది హాజరు కాగా, 88 మంది గైర్హాజరయ్యారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగిన ఈ పరీక్షల కోసం 6 కేంద్రాలను ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని ఆయన పేర్కొన్నారు
News March 2, 2026
టీడీఆర్‌ల మంజూరులో అవినీతికి తావివ్వొద్దు: ప్రణవ్

వీఎంఆర్డీఏ చేపడుతున్న పనుల్లో అధికారులు నిర్లక్ష్యం ఆలసత్వం చూపించవద్దని కమిషనర్ తేజ్ భరత్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ అన్నారు. ఆయన కార్యాలయంలో సోమవారం అధికారులతో అభివృద్ధి పనులు, లేఅవుట్లు, రహదారి విస్తరణ పనులపై సమీక్ష చేశారు. విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారికి టీడీఆర్‌ల మంజూరులో అవినీతి ఉండకూడదన్నారు. సకాలంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు
News March 2, 2026
కలెక్టర్ పీజీఆర్ఎస్‌కు 252 వినతులు

విశాఖలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్‌కు 272 మంది ఫిర్యాదులు చేశారని అధికారులు తెలిపారు. ఫిర్యాదులను స్వయంగా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ విద్యాధరి బాధితుల నుంచి స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులు ఆయా విభాగాల అధికారులను పిలిచి కలెక్టర్ అందజేయగా జీవీఎంసీకి సంబంధించిన టౌన్ ప్లానింగ్ ఇతర ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించారు.


