News March 21, 2025

వెంకటగిరి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

గూడూరు నుంచి వెంకటగిరి వైపు వస్తున్న కారు వర్ధనంపాలెం సమీపంలో రోడ్డు పక్కన వడ్లను బస్తాల్లో నింపుతున్న కూలీలను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారిలో రత్నమ్మ(55) అనే మహిళ మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెంకటగిరి ఎస్ఐ సుబ్బారావు తెలిపారు.

Similar News

News November 12, 2025

సీరం వాడుతున్నారా?

image

చర్మ సంరక్షణలో సీరం కీలకపాత్ర పోషిస్తుంది. మీకున్న చర్మ సమస్యకు తగిన సీరం ఎంచుకోవడం ముఖ్యం. విటమిన్ సి సీరం వృద్ధాప్య ఛాయల్ని, హ్యాలురోనిక్ యాసిడ్ ఉన్న సీరం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ముఖంపై ముడతలు ఉంటే రెటినాల్ సీరం, కాలుష్యం వల్ల దెబ్బతిన్న చర్మానికి బీటా కెరొటిన్, గ్రీన్ టీ, బెర్రీలు, దానిమ్మ, ద్రాక్ష గింజల సారం ఉన్న సీరం మంచిది. సున్నిత చర్మం ఉంటే యాంటీఇన్ఫ్లమేటరీ సీరం ఎంచుకోవాలి.

News November 12, 2025

పాఠశాలల తనిఖీలకు 7 బృందాలు: అడిషనల్ కలెక్టర్

image

జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల నిరంతరం తనిఖీలు చేసేందుకు మూడు బృందాలను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ అడిషనల్ కలెక్టర్, డీఈవో వెంకట్ రెడ్డి వెల్లడించారు. హై స్కూళ్ల తనిఖీలకు మూడు, ప్రైమరీ స్కూళ్లకు మూడు, అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు ఒకటి చొప్పున మొత్తం 7 జిల్లా స్థాయి బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ బృందాలు స్కూళ్లను తనిఖీలు చేస్తూ అక్కడున్న అన్ని పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదిస్తారన్నారు.

News November 12, 2025

WGL: ఒక్క వరదకు రూ.5 కోట్లు వాగులో కొట్టుకుపోయే..!

image

జిల్లాలోని పర్వతగిరి మండలంలో ఆకేరు వాగుపై రూ.5.57 కోట్లు ఖర్చుతో చెక్‌డ్యామ్ కింద సీసీ రోడ్డు నిర్మించారు. 2024లో పూర్తి చేసిన రహదారి మొన్నటి వర్షాలతో వాగులో కొట్టుకుపోయింది. ఆదిత్య ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ నిర్మించిన ఈ పనిలో నాణ్యతా ప్రమాణాలు పాటించలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నాబార్డ్‌ ద్వారా రూ.3.02 కోట్లు రుణం, మిగతాది ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారి ఇప్పుడు రైతులకు తలనొప్పిగా మారింది.