News March 21, 2025
ALERT: మన్యం జిల్లాకు వర్ష సూచన

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన మన్యం జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.
Similar News
News March 31, 2025
అల్లవరం: బ్రిడ్జి పైనుంచి దూకేసిన వ్యక్తి గల్లంతు

అల్లవరం మండలం బోడసకుర్రు- పాశర్లపూడి గ్రామాల మధ్యలోని వైనతేయ వారధిపై నుంచి దూకి ఆదివారం రాత్రి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అమలాపురం నుంచి ఓ కారులో వచ్చిన వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేశాడని స్థానికులు తెలిపారు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. దీంతో అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 31, 2025
MBNR: సర్వం సిద్ధం.. నేడే రంజాన్ పండుగ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో నేడు ముస్లింలు రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) నిర్వహించుకోనున్నారు. ఇప్పటికే ఈద్గాలు, మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 30 రోజులుగా దీక్షలు చేస్తున్న ముస్లింలు నెల వంక కనిపించటంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ చాంద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
News March 31, 2025
VJA: పాస్టర్ ప్రవీణ్ కేసులో కీలక విషయాలు

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం బెజవాడలో ప్రవీణ్ కేసు విచారణలో సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రమాదం జరిగిన రోజు ప్రవీణ్ గుంటుపల్లి నుంచి భవానీపురం మధ్య బైక్‌తో సహా రోడ్డుపై పడిపోయినట్లు సీసీ ఫుటేజీలో కనిపించింది. అదే సమయంలో అతని బైక్ డోమ్ పగిలినట్లు గుర్తించారు. త్వరలో మరిన్ని వివరాలు వివరించనున్నట్లు పేర్కొన్నారు.