News March 21, 2025

ALERT: అల్లూరి జిల్లాకు వర్ష సూచన

image

భగ్గమంటున్న ఎండలు, ఉక్కబోతతో అల్లాడిన అల్లూరి జిల్లా వాసులకు APSDMA చల్లటి కబురు చెప్పింది. జిల్లాలో శనివారం వడగాలులు, ఆదివారం వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. పిడుగులతో కూడిన తేలికపాటి, మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు చెట్ల క్రింద నిలబడరాదని AP డిజాస్టర్ మేనేజ్మెంట్ తెలిపింది.

Similar News

News September 15, 2025

బాధిత కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం: HYD కలెక్టర్

image

వరద కారణంగా మృతిచెందిన కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం ఇస్తామని కలెక్టర్ హరిచందన వెల్లడించారు. బాడీ దొరికిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత ఇళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, వరద ఉద్ధృతి పెరిగే సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొన్ని నాళాలపై నిర్మాణాలు జరుగుతుండటంతో ప్రమాదాలు తలెత్తుతున్నాయని, అలాంటి నిర్మాణాలపై చర్యలు తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు.

News September 15, 2025

సంగారెడ్డి: ఐటీఐల్లో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు దరఖాస్తు గడువును ఈనెల 30 వరకు పొడిగించినట్లు ఐటీఐ కన్వీనర్ తిరుపతి రెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు http://iti.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఇది చివరి అవకాశమని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 15, 2025

ఏఐబీఎస్ఎస్ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా సేవాలాల్ నాయక్

image

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా సేవాలాల్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై ఉంచిన విశ్వాసాన్ని నిబద్ధతతో, మరింత బాధ్యతతో నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. ఈ పదవిని తనకు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఉమేష్ జాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాములు నాయక్, ఇతర జిల్లాల అధ్యక్షులు, సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.