News March 24, 2024

IPL: ముంబై ఇండియన్స్ టార్గెట్ 169

image

అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో గుజరాత్ జట్టు 20ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 రన్స్ చేసింది. సాయి సుదర్శన్(45), గిల్(31) మాత్రమే రాణించారు. ముంబై జట్టులో బుమ్రా 3, కోయెట్జీ 2, చావ్లా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.

Similar News

News July 6, 2025

మా విషయం ఇండియా మొత్తం తెలుసు: చాహల్

image

ఆర్జే మహ్వాష్‌తో డేటింగ్‌పై టీమ్ ఇండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ స్పందించారు. కపిల్ శర్మ షోలో అతడి డేటింగ్ ప్రస్తావన వచ్చింది. ‘కౌన్ హై వో లడ్కీ’ అంటూ కపిల్ ప్రశ్నించారు. దీనికి చాహల్ స్పందిస్తూ ‘నాలుగు నెలల కిందటే మా డేటింగ్ విషయం ఇండియా మొత్తం తెలుసు’ అని సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా ఆమె పేరు ప్రస్తావించకపోయినా క్లారిటీ ఇచ్చాడని సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

News July 6, 2025

ఆ చిన్నారే ఇప్పుడు హీరోయిన్‌గా ఎంట్రీ..

image

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ ఫస్ట్ <<16964615>>గ్లింప్స్<<>> తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా సారా అర్జున్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈమె ఎవరో కాదు చియాన్ విక్రమ్ ‘నాన్న’ సినిమాలో నటించిన చిన్నారి. బాలనటిగా పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. దీంతో పాటు యాడ్స్‌లోనూ మెరిశారు. హీరోయిన్‌గా తొలి సినిమానే స్టార్ సరసన నటించే ఛాన్స్ కొట్టేశారు. ఆమె నాన్న రాజ్ అర్జున్ కూడా నటుడే.

News July 6, 2025

F-35B గురించి తెలుసా?

image

Lockheed Martin అనే US కంపెనీ తయారు చేసిన అత్యాధునిక ఐదో తరం <<16919199>>F-35B<<>> యుద్ధవిమానాన్ని UK కొనుగోలు చేసింది. ఇది గంటకు 1,975KM వేగంతో ప్రయాణించగలదు. టేకాఫ్ అయ్యేందుకు 500 ఫీట్ల రన్ వే సరిపోతుంది. కార్బన్ ఫైబర్, టైటానియం, అల్యూమినియం మెటల్స్ వాడటం వల్ల రాడార్లు దీన్ని గుర్తించలేవు. ఫలితంగా శత్రు దేశానికి తెలియకుండా దాడులు చేయవచ్చు. ఇది జూన్ 14న తిరువనంతపురం (కేరళ)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది.