News March 21, 2025

నల్గొండ: గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటిన యువతి

image

నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరుకి చెందిన పోలగాని నరసింహ గౌడ్, వెంకాయమ్మ దంపతుల కుమార్తె శ్వేత గ్రూప్స్ ఫలితాల్లో సత్తా చాటింది. గ్రూప్-1లో 467మార్కులు, గ్రూప్-2లో 412 స్టేట్ ర్యాంక్, గ్రూప్-3లో 272 ర్యాంక్ సాధించింది. 3 నెలల క్రితం గ్రూప్-4 ఉద్యోగం సాధించి అడవిదేవులపల్లి MRO ఆఫీసులో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తోంది. గ్రూప్స్‌లో సత్తా చాటడంతో పలువురు శ్వేతను అభినందిస్తున్నారు.

Similar News

News March 31, 2025

పెరిగిన బంగారం ధరలు

image

రెండ్రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.91,190గా ఉంది. అటు 22 క్యారెట్ల పసిడి రూ.650 ఎగిసి రూ.84,250గా విక్రయిస్తున్నారు. గత పది రోజుల్లో బంగారంపై ఇది రెండో అత్యధిక పెరుగుదల. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ ధర రూ.1,13,000గా విక్రయాలు జరుగుతున్నాయి.

News March 31, 2025

మొక్కజొన్న కంకి తిని వ్యక్తి మృతి

image

మొక్కజొన్న కంకులు తిని ఓ వ్యక్తి అస్వస్థతకు గురై చనిపోయిన ఘటన కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. వినోభానగర్‌‌‌‌‌కి చెందిన జర్పల కృష్ణ మొక్కజొన్న సాగు చేస్తున్నాడు. తోటకు కాపలాగా వెళ్లి కంకులు కాల్చుకొని తిన్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఒళ్లునొప్పులతో అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయాడు.

News March 31, 2025

కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి ఫైర్

image

తెలంగాణలో హరిత విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, BRS ఒక్కటేనని దుయ్యబట్టారు. గతంలో BRS హయాంలో కాళేశ్వరం నిర్మాణానికి 25 లక్షల చెట్లను తొలగించారన్నారు. ఇప్పుడు గచ్చిబౌలిలోని HCUలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తోందని ఫైరయ్యారు. అటవీ మాఫియాలో తెలంగాణ బందీ అయిందన్నారు. గొడ్డలి మారలేదని, పట్టిన చేతులు మారాయని విమర్శించారు.

error: Content is protected !!