News March 21, 2025
పెంబి: అన్నం పెట్టలేదని భార్యను చంపాడు!

అన్నం పెట్టడం లేదని భార్యని చంపాడో భర్త. ఖానాపూర్ పోలీసుల వివరాలు.. పెంబి పరిధిలోని దాసునాయక్ తండాకి చెందిన అర్జున్‌కు గోసంపల్లికి చెందిన నిరోజతో వివాహం జరిగింది. కాగా భర్త మద్యానికి బానిసై రోజు గొడవపడే వాడు. ఈ నెల 18న మద్యం తాగి వచ్చి భోజనం పెట్టలేదని గొడవపడ్డాడు. నిరోజను కిందపడేసి కొట్టి, గొంతుపై కాలువేసి తొక్కడంతో ఆమె మృతిచెందింది. నిరోజ అన్న ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని అరెస్ట్ చేశారు.
Similar News
News March 31, 2025
వేసవిలో ఇలా చేయండి..

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వివిధ కారణాలతో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం, జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలని చెబుతున్నారు. చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.
News March 31, 2025
అచ్యుతాపురం చేరుకున్న మంత్రి లోకేశ్

అచ్యుతాపురం-అనకాపల్లి రహదారి విస్తరణ పనులకు సోమవారం మధ్యాహ్నం అచ్యుతాపురం చేరుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌కు స్వాగతం లభించింది. మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, రాష్ట్ర రహదారుల కార్పొరేషన్ ఛైర్మన్ ప్రగడ నాగేశ్వరావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు బత్తుల తాతయ్య బాబు, ప్రధాన కార్యదర్శి లాలం కాశీనాయుడు పుష్ప గుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.
News March 31, 2025
సిరిసిల్ల: కుటుంబ సభ్యుల పాత్ర కీలకం: కమాండెంట్

ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించడంలో కుటుంబసభ్యుల బాధ్యత చాలా కీలకమని సిరిసిల్ల బెటాలియన్ కమాండెంట్ సురేష్ అన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధి పెద్దూరులోని బెటాలియన్‌లో ఆర్ఎస్ఐ వై నారాయణ ఉద్యోగ విరమణ పొందిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కర్తవ్య నిర్వహణ కోసం తమ సుఖసంతోషాలను త్యాగంచేసి శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు అంకితం అవుతారని స్పష్టంచేశారు. ఉద్యోగవిరమణ అనంతరం కుటుంబసభ్యులతో ఆనందంగా గడపాలన్నారు.