News March 21, 2025
జగిత్యాల జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఎండలు కాస్త తగ్గాయి. గురువారం జైన, జగ్గసాగర్ 38℃ ఉష్ణోగ్రత నమోదైంది. అటు మన్నెగూడెం 37.9, అల్లీపూర్, పెగడపల్లె 37.8, సారంగాపూర్ 37.6, మేడిపల్లె, మల్లాపూర్ 37.5, మారేడుపల్లి 37.4, రాయికల్ 37.1, వెల్గటూర్, జగిత్యాల 37, నేరెల్లా, కొల్వాయి 36.9, ఐలాపూర్ 36.9, గొల్లపల్లె 36.7, సిరికొండ 36.5, గుల్లకోటలో 36.2℃ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గురువారం జిల్లాలో కాస్త చల్లటి వాతావరణం నెలకొంది.
Similar News
News March 31, 2025
ఏలూరు: మహిళా ఖైదీ సూసైడ్.. ఇద్దరు సస్పెండ్

ఏలూరు జిల్లా జైల్లో నిన్న వాష్‌రూమ్‌లో జీలుగుమిల్లి(M) ఆకులగూడేనికి చెందిన మహిళా ఖైదీ శాంతకుమారి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె సూసైడ్‌పై విచారణ చేపట్టిన డీఎస్పీ శ్రావణ్‌కుమార్, ఆర్డీవో అంబరీష్ జైలును పరిశీలించారు. హెడ్‌వార్డర్ వరలక్ష్మి, వార్డర్ నాగమణిలు నిర్లక్ష్యంగా విధులు నిర్వహించడతోనే ఆమె సూసైడ్‌కు ఆస్కారం ఏర్పడిందనే ఆరోపణలు రావడంతో వారిని సస్పెండ్ చేశారు.
News March 31, 2025
పెబ్బేరు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన పెబ్బేరులో నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. జాతీయ రహదారిపై గుర్తుతెలియని మహిళ(40)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడకక్కడే మృతిచెందింది. మృతురాలు మతిస్తిమితం లేక రోడ్డు వెంట తిరుగుతుందా లేక ఇంకేమైనా కారణాల అనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
News March 31, 2025
GOOD NEWS: తగ్గిన టోల్ ఛార్జీలు

హైదరాబాద్-విజయవాడ NHపై టోల్ ఛార్జీలు తగ్గాయి. ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 1) నుంచి తగ్గిన రుసుములు అమల్లోకి రానున్నాయి. ఈ హైవేపై 3 టోల్ ప్లాజాలు (పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు) ఉన్నాయి. పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు రూ.15, రెండువైపులా కలిపి రూ.30, బస్సు, ట్రక్కులకు రూ.50, రెండువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు వద్ద అన్ని వాహనాలకు ఒక వైపుకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10కి కుదించారు.