News March 21, 2025

కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలి: సీఎం చంద్రబాబు

image

AP: ప్రతి బుధవారం నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలతో సమావేశం నిర్వహించాలని ఎమ్మెల్యేలు, పార్టీ ఇంఛార్జ్‌లను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించేలా కృషి చేయాలని తెలిపారు. అదే రోజు గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుంచి వినతులు తీసుకోవాలన్నారు. ఇంఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన జిల్లాలో నెలకు 2 రోజులు తప్పనిసరిగా పర్యటించాలని సీఎం అన్నారు.

Similar News

News January 5, 2026

మళ్లీ కలిసిపోయిన ట్రంప్, ఎలాన్ మస్క్!

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క్ మధ్య విభేదాల కారణంగా దూరం పెరిగిన విషయం తెలిసిందే. ట్రంప్‌పై కోపంతో మస్క్ ఒక పార్టీని కూడా ప్రకటించారు. అయితే పరిస్థితులు ఇప్పుడు భిన్నంగా ఉన్నాయి. వాళ్లిద్దరూ కలిసిపోయినట్లు కనిపిస్తోంది. గత రాత్రి ట్రంప్, అతని భార్యతో కలిసి డిన్నర్ చేసినట్లు మస్క్ ఓ ఫొటో రిలీజ్ చేశారు. ‘2026 అద్భుతంగా ఉండబోతోంది’ అని ట్వీట్ చేశారు.

News January 5, 2026

శివ మానస పూజ చేద్దామా?

image

మూర్తి పూజ కన్నా మానస పూజ ఎన్నో రెట్లు శ్రేష్ఠమని శాస్త్రాలు చెబుతున్నాయి. ‘నా ఆత్మయే శివుడు. నా శరీరమే ఆలయం’ అనే భావనతో శివ మానస పూజ చేస్తారు. బాహ్య వస్తువులతో సంబంధం లేకుండా మదిలోనే శివుడిని ఆరాధించే ఈ ప్రక్రియను ఆదిశంకరాచార్యులు రచించారు. ఈ పూజతో మనసులో చింతలు తొలగుతాయని, శివసాన్నిధ్యాన్ని సులభంగా పొందవచ్చని పండితులు చెబుతారు. శివ మానస పూజ ఎలా చేయాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News January 5, 2026

వరి నారుమడిలో జింకు లోపం నివారణ

image

పెరిగిన చలి కారణంగా ఇప్పటికే పోసిన వరి నారుమళ్లకు జింక్ ధాతువు లభ్యత తగ్గుతుంది. నారుమడిలో జింక్ లోప లక్షణాలు కనిపిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపి నారుమడిలో పిచికారీ చేయాలి. అలాగే వరి నారుమడికి పది గ్రాముల 19:19:19 పోషకాన్ని, 2.5 గ్రాముల కార్బెండజిమ్, మ్యాంకోజెబ్ మిశ్రమాన్నిలీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.