News March 24, 2024
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో చండీ హోమం

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆదివారం చండీ హోమం వైభవంగా జరిగింది. పౌర్ణమి సందర్భంగా ఆలయ వేద పండితులు, ఆలయ ప్రధాన అర్చకులు రామతీర్థశర్మ, పూజారులు చండీ హోమంను కనుల పండువగా నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమం అనంతరం ఆలయ సిబ్బంది భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Similar News
News April 1, 2026
రంగారెడ్డి: రేపు గ్రామ, వార్డు సభలు.. ప్రభుత్వ సూచనలు

1) ఉ.10గంటలకు రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ ఆలపించి, సభను ప్రారంభించాలి.
2) గ్రామసభలో సర్పంచ్‌తోపాటు పాలకవర్గం, వార్డు సభలో మున్సిపల్ ఛైర్మన్‌తోపాటు పాలకవర్గం, అధికారులు, ప్రజలు హాజరుకావాలి.
3) CMసందేశాన్ని చదివి వినిపించాలి.
4) ప్రభుత్వ విజయాలు, 6గ్యారంటీలపై అవగాహన కల్పించి, పథకాలకు అర్హులను గుర్తించాలి.
5) ప్రజాసమస్యల కోసం ఫిర్యాదుల బాక్సులను ఏర్పాటు చేయాలి.. పరిష్కారాలపై కార్యాచరణ రూపొందించాలి.

HYD: రూ.2,501 కోట్ల ఆస్తి పన్ను వసూలు

క్యూర్ పరిధిలోని 3 కార్పొరేషన్లలో 2025- 26 ఆర్థిక సంవత్సరానికి రూ.2,501.25 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. భారీ బకాయిదారులకు వడ్డీపై 90 శాతం రాయితీ, ఓటీఎస్ సదుపాయాన్ని వివరించడం, ఇతరత్రా చర్యలతో ఇది సాధ్యమైందని అధికారులు తెలిపారు. ఆర్థిక సంవత్సరం చివరి రోజైన మంగళవారం ఒక్కరోజే వంద కోట్లకు పైగా ఆస్తి పన్ను జీహెచ్ఎంసీ ఖజానాకు చేరినట్లు సమాచారం. కాగా, సరైన లెక్కలు నేడు స్పష్టం కానున్నాయి.