News March 21, 2025
బనగానపల్లెలో నకిలీ వైద్యుడి గుట్టురట్టు.. ఆస్పత్రి సీజ్

బనగానపల్లెలో ఆయుష్ వైద్య అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా బనగానపల్లెలో అనధికారికంగా, వైద్య అర్హతలు లేని నకిలీ వైద్యుడు సూర్య నాయుడును గుర్తించారు. పక్షవాతానికి వైద్యం చేస్తానంటూ ప్రజల ఆరోగ్యానికి హాని చేస్తున్నాడనే ఫిర్యాదులు అందడంతో ఆయుష్ శాఖ అధికారులు డా.రవికుమార్, వాణి తనిఖీకి వెళ్లగా నకిలీ వైద్యుడు పరారయ్యాడు. ఆయుష్ అధికారులు ఆసుపత్రిని సీజ్ చేశారు.
Similar News
News March 4, 2026
కర్నూలు జిల్లా కోర్టులో భద్రత సమీక్ష

కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో జడ్జి రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో అడిషనల్ ఎస్పీ కృష్ణమోహన్, డీఎస్పీ బాబు ప్రసాద్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలు, గస్తీ విధులు, ఖైదీల రక్షణను సమీక్షించారు. కోర్టు పరిసరాల్లో అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. భద్రత విషయంలో రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు.
News March 3, 2026
మంత్రి టీజీ భరత్ ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా?

ఈ రెండేళ్లలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఎన్ని పరిశ్రమలు తీసుకోచ్చారు? యువతకు ఎన్ని ఉద్యోగాలు కల్పించారో చర్చకు సిద్ధమా అని వైసీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం కర్నూలులో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు రెడ్ బుక్ పాలనలో పారిశ్రామిక వేత్తలు పరారవుతున్నారన్నారు. రాష్ట్రంలో పబ్‌లు తప్ప హబ్‌లు లేవన్నారు. కార్మిక రంగాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు.
News March 3, 2026
కర్నూలులో హత్య.. జీవిత ఖైదు

కర్నూలు షరీఫ్ నగర్‌లో 2021లో జరిగిన హత్య కేసులో ముద్దాయి దగ్గుపాటి రాజుకు జీవితకాల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి శ్రీ కబర్థి తీర్పునిచ్చారు. హత్యాయత్నం కేసులో మరో 3 ఏళ్ల శిక్షను ఖరారు చేశారు. వడ్డిపాటి వెంకటేశ్వర్లుపై కత్తితో దాడిచేసి హత్య చేసినట్లు నేరం రుజువైంది. కేసు దర్యాప్తు చేసి సాక్ష్యాధారాలు సమర్పించిన పోలీసు అధికారులను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు.


