News March 21, 2025
సరికొత్త వివాదంలో OLA!

విద్యుత్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ ఓలా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓలా వెల్లడించిన వాహన విక్రయాల సంఖ్య, వాహన రిజిస్ట్రేషన్ల సంఖ్యకు సరిపోలడం లేదని కేంద్రం గుర్తించింది. దీనిపై దర్యాప్తు చేయాలని ARAIని ఆదేశించింది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని చెప్పినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా FEBలో 25వేల వాహనాలు అమ్మినట్లు OLA పేర్కొనగా వాహన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ల సంఖ్య 8,652గా ఉండటం గమనార్హం.
Similar News
News March 31, 2025
పెరిగిన బంగారం ధరలు

రెండ్రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.91,190గా ఉంది. అటు 22 క్యారెట్ల పసిడి రూ.650 ఎగిసి రూ.84,250గా విక్రయిస్తున్నారు. గత పది రోజుల్లో బంగారంపై ఇది రెండో అత్యధిక పెరుగుదల. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ ధర రూ.1,13,000గా విక్రయాలు జరుగుతున్నాయి.
News March 31, 2025
కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి ఫైర్

తెలంగాణలో హరిత విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, BRS ఒక్కటేనని దుయ్యబట్టారు. గతంలో BRS హయాంలో కాళేశ్వరం నిర్మాణానికి 25 లక్షల చెట్లను తొలగించారన్నారు. ఇప్పుడు గచ్చిబౌలిలోని HCUలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తోందని ఫైరయ్యారు. అటవీ మాఫియాలో తెలంగాణ బందీ అయిందన్నారు. గొడ్డలి మారలేదని, పట్టిన చేతులు మారాయని విమర్శించారు.
News March 31, 2025
నా కొడుకు ఎవరినీ మోసం చేయలేదు: దర్శకుడి తల్లి ఆవేదన

‘L2:ఎంపురాన్’ మూవీలోని సన్నివేశాలు వివాదానికి దారి తీయడంపై దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు. ఈ సినిమా విషయంలో పృథ్వీరాజ్‌ను అనవసరంగా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పృథ్వీరాజ్ ఎవ్వరినీ మోసం చేయలేదని, చేయబోరని చెప్పారు. సినిమా స్క్రిప్ట్ విషయంలో తప్పులుంటే అందరి బాధ్యత ఉంటుందన్నారు.