News March 21, 2025

MBNR: టెన్త్ విద్యార్థులు.. ఫోన్ చేయండి

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా టెన్త్ పరీక్షలపై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులకు ఏవైనా సూచనలు, సందేహాలు ఉంటే MBNR-98487 57542,93908 11476, NGKL-94406 48324,98850 17701 టోల్ ఫ్రీ నంబర్లు ఫోన్ చేయాలని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. హాల్ టికెట్‌పై బార్ కోడ్ ఉంటుంది. స్కాన్ చేస్తే పరీక్ష కేంద్రం లోకేషన్ సూచిస్తుందని అధికారులు తెలిపారు.

Similar News

News September 12, 2025

MBNR: అడ్డాకులలో అత్యధిక వర్షపాతం నమోదు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. అత్యధికంగా అడ్డాకుల 23.5 మిల్లీమీటర్ల వర్షం పడింది. చిన్నచింతకుంట 23.3, బాలానగర్ 15.3, మిడ్జిల్ 13.3, హన్వాడ 11.0, మహమ్మదాబాద్ 10.8, కౌకుంట్ల 7.3, సల్కర్ పేట 7.3, భూత్పూర్ 6.3, నవాబుపేట 6.0 మిల్లీమీటర్ల వర్షం రికార్డు అయింది.

News September 11, 2025

జడ్చర్ల: ఎరువు విక్రయ కేంద్రాల తనిఖీ

image

జడ్చర్ల మండలంలో ఎరువుల విక్రయ కేంద్రాలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యూరియా బస్తాలను సమయానికి, పారదర్శకంగా పంపిణీ చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. రైతులకు ఎరువుల పంపిణీ విషయంలో ఎటువంటి అవకతవకలు జరగకూడదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

News September 11, 2025

MBNR: భారీ వర్షాలు.. SP కీలక ఆదేశాలు

image

వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు వచ్చే మూడు రోజులు మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. చెరువులు, కుంటలు, వాగులు నిండుకుండలా ఉన్నందున గ్రామాల ప్రజలు, రైతులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే డయల్ 100 లేదా పోలీసు కంట్రోల్ రూమ్ నంబర్ 87126 59360కు సమాచారం ఇవ్వాలన్నారు.