News March 21, 2025
వరంగల్: భద్రకాళి అమ్మవారి నేటి అలంకరణ

భద్రకాళి అమ్మవారికి ఓరుగల్లు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఫాల్గుణ మాసం శుక్రవారం అర్చకులు ఉదయాన్నే భద్రకాళి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు పూజలు చేసి వేదాశీర్వచనం, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భక్తులు ఉన్నారు.
Similar News
News October 18, 2025
సహజంగా పరిమళాలు అద్దేద్దాం..

ఎక్కడికైనా వెళ్లడానికి రెడీ అవ్వడం అంటే మేకప్, మంచి డ్రెస్ చివరిగా ఫెర్ఫ్యూమ్ వేసుకుంటాం. కానీ వీటిలో ఉండే రసాయనాల వల్ల దుస్తులపై మరకలు పడటంతో పాటు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇలా కాకుండా కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ వాడితే రసాయనాలు లేకుండా సహజసిద్ధ పరిమళాలను ఆస్వాదించొచ్చంటున్నారు నిపుణులు. వాటిల్లో లావెండర్, మింట్, గంధం నూనె, రోజ్ ఆయిల్ వంటివి మంచి స్మెల్‌ని ఇస్తూనే ఆరోగ్యాన్నీ కాపాడతాయి.
News October 18, 2025
నిర్మల్: పీటీఎం మీటింగ్ వాయిదా

బీసీ బంద్ నేపథ్యంలో ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే పీటీఎం (పేరెంట్ టీచర్స్ మీటింగ్) రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు రద్దు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న ఓ ప్రకటనలో తెలిపారు. రద్దు విషయాన్ని ఆయా ఎంఈఓలు, స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేయాలని వారు కోరారు.
News October 18, 2025
సింహాచలం ఆలయ పైకప్పుకు కొత్త అందం

సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామి దేవస్థానం ఇప్పుడు కొత్త రూపంలో మెరిసిపోతోంది. ఆలయ ప్రధాన గర్భగృహం, కళ్యాణ మండపం, వ్రత మండపం, వంటశాలకు టెర్రాకోట పెంకులతో కొత్త పైకప్పు ఏర్పాటు చేశారు. పూణేకు చెందిన లార్డ్ వేంకటేశ్వర చారిటబుల్ అండ్ రీలిజియస్ ట్రస్ట్ సుమారు రూ.5 కోట్లతో ఈ మరమ్మతులు చేపట్టింది. పాత పద్ధతిలోనే పైకప్పును పునరుద్ధరించి, శిల్పకళా అందాన్ని కాపాడుతూ ఆలయానికి నూతన శోభను చేకూర్చింది.