News March 21, 2025
రెంటచింతల: ఊయల తాడు బిగుసుకొని బాలుడి మృతి

ఊయల తాడు బిగుసుకొని ఓ బాలుడు మృతిచెందిన ఘటన రెంటచింతలలోని ఆంజనేయస్వామి మాన్యంలో జరిగింది. సలిబిండ్ల అద్విక్ రెడ్డి (10) ఐదో తరగతి చదువుతున్నాడు. గురువారం ఇంట్లో ఉన్న ఊయలలో అతివేగంతో ఊగగా తాడు మెలికలు పడి బాలుడి గొంతుకు బిగుసుకొని చనిపోయాడు. అప్పటి వరకు తమ కళ్ల ముందు ఆడుతూ పాడుతూ తిరిగిన బాలుడు విగతజీవిగా మారడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
Similar News
News September 19, 2025
కార్ల ధరలు తగ్గించిన మారుతి సుజుకీ

కొత్త GST రేట్ల నేపథ్యంలో మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గించింది. S-ప్రెసోపై రూ.1,29,600, ఆల్టో K10పై రూ.1,07,600, సెలేరియోపై రూ.94,100, డిజైర్‌పై రూ.87,700, వ్యాగన్-Rపై రూ.79,600, ఇగ్నిస్‌పై రూ.71,300, స్విఫ్ట్‌పై రూ.84,600, బాలెనోపై రూ.86,100, ఫ్రాంక్స్‌పై రూ.1,12,600, బ్రెజ్జాపై రూ.1,12,700, గ్రాండ్ విటారాపై రూ.1,07,000, జిమ్నీపై రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.
News September 19, 2025
వైసీపీ కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించింది: పుల్లారావు

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రతి పథకానికి తన బొమ్మ వేసుకోవాలనుకున్నారని, అందుకే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయిందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో దేశంలో అమలు కాని పథకాలన్నీ అమలవుతాయన్నారు. గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించిందని ఆయన విమర్శించారు. చిలకలూరిపేటలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
News September 19, 2025
కడప: అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

బాలికను అత్యాచారం చేసిన కేసులో వేంపల్లెకు చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులుకు కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి యామిని 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధించారు. 15 ఏళ్ల బాలికను రామాంజనేయులు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి 2019లో వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. DSP వాసుదేవన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.