News March 21, 2025

శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 58,872 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా..23,523 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.

Similar News

News April 1, 2025

ALERT: ఎండలు, పిడుగులతో వానలు

image

AP: రాష్ట్రంలో రేపు 26, ఎల్లుండి 28 మండలాల్లో <>వడగాలులు వీస్తాయని<<>> APSDMA వెల్లడించింది. చాలా చోట్ల 39-41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు గురువారం రాయలసీమలో, శుక్రవారం ఉత్తరాంధ్రలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని సూచించింది.

News March 31, 2025

KKR చిత్తు.. బోణీ కొట్టిన ముంబై

image

వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై బోణీ కొట్టింది. KKRపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలో ఛేదించింది. రోహిత్(13) నిరాశపర్చగా, రికెల్టన్ 62*, జాక్స్ 16, సూర్య 27* రన్స్ చేశారు. రస్సెల్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు బ్యాటర్లంతా విఫలమవడంతో KKR 16.2 ఓవర్లలోనే ఆలౌటైంది. MI బౌలర్లలో కుమార్ 4, చాహర్ 2, బౌల్ట్, హార్దిక్, పుతుర్, శాంట్నర్ తలో వికెట్ తీశారు.

News March 31, 2025

తిరుమలలో మద్యం, మాంసం.. వైసీపీ ఆగ్రహం

image

AP: తిరుమలలో మద్యం, మాంసం వినియోగం, అనుచిత ప్రవర్తన ఘటనలు పెరిగిపోయాయని YCP విమర్శించింది. మూడంచెల భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ పరిస్థితి దిగజారిపోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘JAN 18న తమిళనాడు భక్తులు కొండపై ఎగ్ బిర్యానీ తిన్నారు. మార్చి 15న మద్యం మత్తులో యువకులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. మార్చి 17న కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ మద్యం తీసుకెళ్లాడు’ అని పేర్కొంది.

error: Content is protected !!