News March 21, 2025
అన్నమయ్య: మహిళను రేప్ చేసిన వ్యక్తిపై కేసు.!

మహిళను నమ్మించి నయవంచనకు గురి చేయడమే కాకుండా, అత్యాచారానికి పాల్పడి ఆపై అబార్షన్ చేయించిన వ్యక్తిపై మదనపల్లె వన్‌టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు. సీఐ ఎరిసావలి తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె బెంగళూరు రోడ్డులోని ఓ ఆసుపత్రిలో మేనేజర్‌గా పనిచేస్తున్న రాజేశ్ అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న నర్స్‌పై అత్యాచారం చేశాడు. ఈ మేరకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News January 15, 2026
కంచికచర్ల ముంగిట Way2News ముచ్చట!

కంచికచర్లలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మహిళలు రంగవల్లులతో గ్రామాన్ని శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా Way2News లోగోను సైతం రంగవల్లుల రూపంలో అద్దడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామానికి చెందిన అపర్ణ అనే మహిళ నిరంతరం వార్తలు ప్రజలకు చేరవేస్తూ, తన సేవలతో ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారని ఆమె కొనియాడారు.
News January 15, 2026
పక్షిలా ఎగరాలి అంటే.. భీమవరం రండి..!

కాళ్ల మండలం పెదమీరంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘స్కైరైడ్ అడ్వెంచర్’ను బుధవారం డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, కలెక్టర్ నాగరాణి ప్రారంభించారు. కలెక్టర్ స్వయంగా రైడ్ చేసి, గగన విహారం అద్భుతమైన అనుభవమని కొనియాడారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ప్రజలకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సాహస క్రీడను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
News January 15, 2026
నేడు మల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి వరపూజ

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి వరపూజ మహోత్సవం గురువారం నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో మహేష్ తెలిపారు. స్వామి వారికి, ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి అమ్మవార్లకు వరపూజ కత్రువు సంక్రాంతి రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మేలో జరిగే నరసింహస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నేడు వరపూజ, నిశ్చయ తాంబూల స్వీకరణ ఉంటుందన్నారు. కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరు కానున్నారు.


