News March 21, 2025
నెల్లూరు: నిరుపేద కుటుంబం.. ఆల్ ఇండియా ర్యాంకు

ఉదయగిరి మండలం జి. చెర్లోపల్లి వడ్డిపాలెం గ్రామానికి చెందిన వెంకటయ్య, నరసమ్మ దంపతుల కుమారుడు శేఖర్ ఆల్ ఇండియా లెవెల్లో GATE ECE గ్రూపులో 425వ ర్యాంక్ సాధించారు. శేఖర్ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోగా.. తల్లి కూలి పనులకు వెళ్లి శేఖర్ని చదివించింది. ఎలాంటి కోచింగ్ లేకుండానే GATE పరీక్ష రాసి తొలిప్రయత్నంలోనే జాతీయస్థాయి ర్యాంకు సాధించాడు. IITలో M.Tech చేసి మంచి జాబ్ సాధించడమే లక్ష్యమని శేఖర్ అన్నారు.
Similar News
News March 22, 2025
నెల్లూరు: బాలికపై లైంగిక వేధింపులు.. ఐదేళ్ల జైలు శిక్ష

బాలికపై లైంగిక వేధింపులు, హత్యాయత్నం చేశాడన్న కేసులో నేరం రుజువు కావడంతో వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానాను జిల్లా పొక్సో కోర్టు స్పెషల్ జడ్జి సిరిపిరెడ్డి సుమ విధించారు. వింజమూరు మండలానికి చెందిన బాలిక 2013 మే 6న కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లగా.. కృష్ణ అనే వ్యక్తి లైగింక దాడికి పాల్పడగా..వ్యతిరేకించడంతో బావిలోకి తోసేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హజరుపరచగా శిక్ష పడింది.
News March 22, 2025
నెల్లూరు: మంత్రి ఫరూక్ సతీమణి మృతి పట్ల ఆనం తీవ్ర విచారం

ఆంధ్రప్రదేశ్ న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎన్ఎండీ ఫరూక్, సతీమణి షహనాజ్, మృతి పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
News March 21, 2025
నెల్లూరు: కేజీబీవీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

నెల్లూరు జిల్లాలోని 12 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 6వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ఏపీసి వెంకటసుబ్బయ్య తెలిపారు. ఆరవ తరగతిలో 40 మందికి, ఇంటర్ ఫస్టియర్లో 40 మందికి ఒక్కో విద్యాలయానికి కేటాయించినట్లు తెలిపారు. అలాగే 7,8,9,10 తరగతులతో పాటు ద్వితీయ ఇంటర్లో ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు.