News March 21, 2025

నల్గొండ ఫస్ట్.. సూర్యాపేటకు ఫోర్త్ ప్లేస్..!

image

రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేని విధంగా నల్గొండలోనే అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. 2,37,664 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లతో NLG మొదటి స్థానంలో ఉండగా.. 1,54,224 కనెక్షన్లతో సూర్యాపేట నాల్గో స్థానంలో ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 1,17,477 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. అన్ని కేటగిరీల విద్యుత్ కనెక్షన్ల పరంగా చూస్తే.. నల్గొండ ఐదో స్థానంలో నిలిచింది.

Similar News

News January 20, 2026

NLG: మున్సిపల్ పోరు.. పెరగనున్న మహిళల ప్రాతినిధ్యం

image

మున్సిపల్ ఎన్నికల వేళ ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్ల లెక్కలు మారాయి. ఈసారి గతంలో కంటే ఎక్కువ మంది మహిళలకు అవకాశం దక్కనుంది. ముఖ్యంగా జనరల్ మహిళా స్థానాలు 5 నుంచి 7కు పెరగడం విశేషం. అయితే, బీసీ మహిళలకు మాత్రం ఈసారి నిరాశే ఎదురైంది. గతంలో 3 స్థానాలుండగా ఈసారి వాటిని 2కే పరిమితం చేశారు. ఇక SC మహిళలకు గతంలో లాగే ఒక స్థానాన్ని కేటాయించారు. ఈ మార్పులు ప్రధాన పార్టీల అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపనున్నాయి.

News January 19, 2026

నల్గొండ: మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు

image

నల్గొండ జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో మహిళా సంఘాలకు రూ.11.38 కోట్ల వడ్డీ లేని రుణాలను పంపిణీ చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా రుణాల పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ వివరించారు.

News January 19, 2026

నల్గొండ: ఇంటర్ కాలేజీలకు నిధులు మంజూరు

image

నల్గొండ జిల్లాలోని 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సైన్స్ ప్రాక్టికల్ పరికరాల కొనుగోలుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో కళాశాలకు రూ.50,000 చొప్పున మొత్తం రూ.6.50 లక్షలను కేటాయించింది. ఈ పరికరాల సరఫరా కోసం అర్హులైన సంస్థల నుండి కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి తెలిపారు. ఆసక్తి గల వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.