News March 24, 2024
జంగారెడ్డిగూడెం: 26న నారా భువనేశ్వరి రాక

నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నేత భీమడోలు వెంకన్న గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నారా భువనేశ్వరి మంగళవారం పేరంపేట గ్రామానికి వస్తున్నారని టీడీపీ మండలాధ్యక్షుడు సాయిల సత్యనారాయణ తెలిపారు. నేతలు కార్యకర్తలు తరలి రావాలని తెలిపారు.
Similar News
News January 7, 2026
ఏలూరు: నిర్లక్ష్యం ఖరీదు.. రూ.900 కోట్లు!

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణ సమయంలో 2019 నాటికి ఇరువైపులా ఖాళీలు వదిలేశారు. ఖాళీల గుండా 2020లో వచ్చిన వరదకి డయాఫ్రం వాల్ పూర్తిగా దెబ్బతింది. దీనిపై గత, ప్రస్తుత ప్రభుత్వాలు పరస్పర విమర్శలు గుప్పించుకున్నాయి. పాలకుల నిర్లక్ష్యం ఖజానాకు భారీగా చిల్లులు పెట్టింది. దెబ్బతిన్న వాల్ స్థానంలో కొత్త నిర్మాణం చేపట్టేందుకు రూ.900 కోట్లు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
News January 7, 2026
ప.గో జిల్లా జేసీ హెచ్చరిక

యూరియా కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బంది పెడితే కేసులు తప్పవని జేసీ రాహుల్ హెచ్చరించారు. డీలర్లు యూరియాతో పాటు జింక్, గుళికలు కొనాలని రైతులకు ఇబ్బందిపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు యూరియా కొనుగోలులో ఏమైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 83310 56742కు తెలియజేయాలన్నారు. మంగళవారం జేసీ ఛాంబర్లో మండల వ్యవసాయ శాఖ అధికారులు, రిటైల్ డీలర్లతో సమీక్షించారు.