News March 21, 2025

MBNR: పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ఈ నెల 24 వరకు పెంపు

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కాలేజీలలో 2వ, 4వ&6వ సెమిస్టర్ పరీక్షల ఫీజు చెల్లింపునకు ఈ నెల 20 వరకు గడువు ముగియనుండగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 24వరకు, ఆలస్య రుసుముతో ఈనెల 27 వరకు గడువు పెంచుతున్నట్లు కాలేజీలకు అధికారులు తెలిపారు. ఇంకా ఫీజు చెల్లించని రెగ్యులర్, బ్యాక్‌లాగ్ విద్యార్థుల నిమిత్తమే ఫీజు చెల్లింపు గడువు పెంచినందుకు డిగ్రీ విద్యార్థులు ఊపిరి పీల్చుకుంటున్నారు. SHARE IT.

Similar News

News November 10, 2025

పరిగి: బ్రేకులు ఫెయిల్.. బస్సు ఢీకొని వ్యక్తి మృతి

image

పరిగి ఆర్టీసీ డిపోలో బస్సు ఢీకొని డిపో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ మెకానిక్ కుద్దూస్ (59) మృతిచెందారు. డిపోలో నుంచి బస్సు ఔటింగ్‌కు వెళ్తున్న సమయంలో ఎదురుగా నిలుచున్న కుద్దూస్ బ్రేకులు ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. వచ్చే ఏడాది ఆయన రిటైర్ కావాల్సి ఉంది. కుద్దూస్ మృతితో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

News November 10, 2025

రూ.50లక్షల కోట్లకు.. ‘మ్యూచువల్’ ఇండస్ట్రీ

image

దేశంలో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సరికొత్త మైలురాయిని దాటింది. అక్టోబర్ నాటికి ఈక్విటీ అండర్ కస్టడీ ఆస్తుల విలువ ₹50లక్షల కోట్లకు చేరింది. ఈ ఏడాది FEBలో విలువ ₹39.21 లక్షల కోట్లుగా ఉండగా ఏకంగా 30% వృద్ధి నమోదయ్యింది. మార్చి 2020లో నెలకు ₹8,500 కోట్లుగా ఉన్న SIPలు SEP 2025 నాటికి ₹29,361 కోట్లకు చేరుకుంది. ఈ పెరుగుదల రిటైల్ పెట్టుబడిదారులలో విశ్వాసానికి నిదర్శనమని నిపుణులు చెబుతున్నారు.

News November 10, 2025

ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన షెడ్యూల్.!

image

ప్రకాశంలో 11వ తేదీన సీఎం చంద్రబాబు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పీసీ పల్లిలోని పెదఇర్లపాడు వద్ద మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు పెదయిర్లపాడు హెలిప్యాడ్ వద్దకు చేరుకోనున్నారు. 10.35 నుంచి 12.15 వరకు పార్కు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత హెలికాప్టర్లో తాడేపల్లికి బయలుదేరి వెళ్తారు.