News March 21, 2025

వరంగల్: చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ముందస్తు సమాచారం సేకరించాలి

image

చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ముందస్తు సమాచారాన్ని సేకరించడం స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది ప్రధాన కర్తవ్యం అని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. స్థానికంగా ఏమీ జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించాలన్నారు. రౌడీ షీటర్లు ప్రత్యేక నిఘ ఏర్పాటు చేయాలని అన్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Similar News

News November 6, 2025

క్వాయర్ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోండి: కలెక్టర్

image

క్వాయర్ పరిశ్రమల స్థాపనకు అమలాపురంలోని కలెక్టరేట్ వద్ద ప్రాంతీయ సదస్సును గురువారం కలెక్టర్ మహేష్ కుమార్ గురువారం నిర్వహించి మాట్లాడారు. కోనసీమ ప్రాంతంలో లక్ష ఎకరాల్లో కొబ్బరి సాగవుతుందన్నారు. కేవలం కొబ్బరికాయలు మాత్రమే విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. క్వాయర్ ఆధారిత పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారు ముందుకు రావాలన్నారు.

News November 6, 2025

భీమవరం: మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

image

భీమవరం గునుపూడి పీఎస్ఎం బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాలను స్వయంగా రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. 936 విద్యార్థులు కలిగిన ఉన్నత పాఠశాలలో విద్యార్థులంతా వరుస క్రమంలో వచ్చి ఆహార పదార్థాలను వడ్డించుకుని భుజించడం సంతోషంగా ఉందన్నారు.

News November 6, 2025

ఫ్రెండ్ దగ్గర అప్పు చేసి లాటరీ టికెట్‌ కొన్నాడు.. గెలవడంతో!

image

రాజస్థాన్‌లోని కోట్‌పూత్లీకి చెందిన కూరగాయల వ్యాపారి అమిత్ సెహ్రా ‘పంజాబ్ స్టేట్ దీపావళి బంపర్ లాటరీ- 2025’లో రూ.11 కోట్లు గెలుచుకున్నారు. లాటరీ టికెట్ కొనేందుకు డబ్బులు లేకపోవడంతో ఆయన తన ఫ్రెండ్ దగ్గర రూ.వెయ్యి అప్పుగా తీసుకున్నాడు. తాజాగా లాటరీ గెలవడంతో సెహ్రా కృతజ్ఞతగా స్నేహితుడి కుమార్తెకు రూ. కోటి బహుమతిగా ఇస్తున్నట్లు తెలిపారు. ఈ డబ్బును ఇల్లు, పిల్లల విద్య, భవిష్యత్తు కోసం వాడతానన్నారు.