News March 21, 2025
హనీట్రాప్: అసెంబ్లీకి వీడియో CDలు తీసుకొచ్చిన BJP నేతలు

కర్ణాటక అసెంబ్లీని హనీట్రాప్ వివాదం కుదిపేస్తోంది. వలపు వలలో చిక్కిన 48 నేతల పేర్లను బయటపెట్టాలని ప్రతిపక్ష BJP డిమాండ్ చేస్తోంది. ఇదిగో ప్రూఫ్ అంటూ వీడియో CDలు పట్టుకొని CM సిద్దరామయ్య ముందు నిరసన వ్యక్తం చేసింది. నేతలు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళన నిర్వహిస్తున్నా పట్టించుకోని సీఎం తలదించుకొని యథావిధిగా తన ప్రసంగం కొనసాగించారు. వివాదంపై అత్యున్నత స్థాయిలో విచారణ జరిపిస్తామని ప్రకటించారు.
Similar News
News March 31, 2025
వేసవిలో ఇలా చేయండి..

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వివిధ కారణాలతో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం, జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలని చెబుతున్నారు. చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.
News March 31, 2025
నిర్మాత ముళ్లపూడి కన్నుమూత

టాలీవుడ్ నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆస్ట్రేలియాలో ఉన్న కుమారుడు వచ్చాక బుధవారం కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈయన దివంగత ఈవీవీ సత్యనారాయణకు దగ్గరి బంధువు. నేను, అల్లుడుగారు వచ్చారు, మనోహరం, ఓ చిన్నదానా లాంటి సినిమాలను ముళ్లపూడి నిర్మించారు.
News March 31, 2025
గుండె సమస్య.. ముంబైకి కొడాలి నాని తరలింపు

వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నానిని ముంబైకి తరలిస్తున్నారు. ఇటీవల గుండె సమస్యతో హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చేరిన నానిని ఇవాళ డిశ్చార్జ్ చేశారు. రక్తనాళాల్లో బ్లాక్‌లకు సర్జరీ చేయాలని సూచించారు. దీంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను ముంబైకి తరలిస్తున్నారు. నాని కుటుంబసభ్యులు ప్రత్యేక విమానంలో అక్కడికి బయల్దేరారు.