News March 21, 2025

ముంతాజ్ హోటల్ భూముల రద్దు: చంద్రబాబు

image

AP: అలిపిరిలో ముంతాజ్, మరో హోటల్‌కు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని రద్దు చేస్తున్నట్లు CM చంద్రబాబు తిరుమలలో ప్రకటించారు. ఏడుకొండలను ఆనుకొని కమర్షియలైజేషన్ ఉండకూడదన్నారు. శ్రీవారి ఆస్తులన్నీ కాపాడటమే లక్ష్యమన్నారు. దేశంలోని అన్ని రాజధానుల్లో శ్రీవారి ఆలయం కట్టాలని నిర్ణయించినట్లు వివరించారు. సీఎంలు ముందుకొస్తే నిర్మాణాలు చేపడతామన్నారు. అంతకుముందు ఆయన దేవాన్ష్ బర్త్‌డే సందర్భంగా అన్నవితరణ చేశారు.

Similar News

News March 31, 2025

నేటితో ముగియనున్న గడువు

image

AP: ఆస్తి పన్ను బకాయిలపై ప్రభుత్వం ప్రకటించిన వడ్డీ రాయితీ గడువు నేటితో ముగియనుంది. ఈ నెల 25న 50% రాయితీ ప్రకటించగా శనివారం ఒక్క రోజే రూ.60 కోట్లు, మొత్తంగా రూ.204 కోట్లు వసూలయ్యాయి. రంజాన్ కారణంగా ఇవాళ సెలవు అయినా పన్ను వసూళ్లకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఉ.9 నుంచి రా.9 వరకు అధికారులు అందుబాటులో ఉంటారు. నిన్న ఉగాది సందర్భంగా ఎక్కువ మంది పన్ను చెల్లింపులు చేయలేదు.

News March 31, 2025

తెలంగాణలో అతి తక్కువ ద్రవ్యోల్బణం

image

TG: దేశంలోనే అతి తక్కువ ద్రవ్యోల్బణం తెలంగాణలో నమోదైనట్లు NSO తెలిపింది. రాష్ట్రంలో ఇది 1.3 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కేరళలో అత్యంత ఎక్కువ ద్రవ్యోల్బణం (7.3 శాతం) నమోదైనట్లు పేర్కొంది. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ (4.9%), కర్ణాటక, బిహార్ (4.5%), జమ్మూ కశ్మీర్ (4.3%)లో అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్నట్లు పేర్కొంది. దేశంలోని 12 రాష్ట్రాలు 4 శాతం కంటే దిగువన ద్రవ్యోల్బణం నమోదు చేశాయి.

News March 31, 2025

రేపటి నుంచే ఇంటర్ తరగతులు

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచే 2025-26 ఇంటర్ విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. సెకండియర్ విద్యార్థులకు మంగళవారం క్లాసులు మొదలు కానుండగా, ఫస్టియర్‌లో చేరే వారికి 7వ తేదీ నుంచి అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. ఈ నెల 23 వరకు తరగతులు నిర్వహించి వేసవి సెలవులిస్తారు. జూన్ 2న తిరిగి క్లాసులు పున: ప్రారంభం కానున్నాయి. అలాగే జూ.కాలేజీల పని వేళలనూ ఉ.9గంటల నుంచి సా.5 వరకు పొడిగించి, 7 పీరియడ్లను 8 చేశారు.

error: Content is protected !!