News March 21, 2025

వేములవాడలో పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య పాఠశాలలో పరీక్షా కేంద్రాలను కలెక్టర్ సందీప్ కుమార్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షా విద్యార్థులు రాస్తున్న తీరును పరిశీలించి, పరీక్ష కేంద్రాల్లో ఉన్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

Similar News

News March 31, 2025

అయిజ: ‘రతంగాపాణి రెడ్డి మన మధ్య లేకపోవడం బాధాకరం’

image

అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు రతంగపాణి రెడ్డి మన మధ్య లేకపోవడం అత్యంత బాధాకరమని అఖిలపక్ష కమిటీ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట రాములు, ఆంజనేయులు, హనుమంతు పేర్కొన్నారు. సోమవారం ఉప్పల గ్రామంలో ఆయన భౌతికదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మలిదశ ఉద్యమంలో రాష్ట్ర సాధన ఆవశ్యకత గురించి యువతను చైతన్యం చేశాడని కొనియాడారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.

News March 31, 2025

విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు: సీఎండీ

image

NPDCL పరిధిలోని 16 సర్కిళ్లలో విద్యుత్ వినియోగదారులకు మరింత ఉత్తమ సేవలు అందించడానికి “కన్స్యూమర్ ఫీడ్ బ్యాక్ సెల్”ను కొత్తగా ఏర్పాటు చేశామని సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి తెలిపారు. మార్చిలో వివిధ క్యాటగిరీలో రిలీజ్ చేసిన కొత్త సర్వీసుల్లో రోజుకు దాదాపు 60 మంది వినియోగదారులకు ఫోన్ చేసి 4 పారామీటర్ల ఫీడ్ బ్యాక్ తీసుకుంటామని చెప్పారు.

News March 31, 2025

వేసవిలో ఇలా చేయండి..

image

వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. వివిధ కారణాలతో నీరు తాగడాన్ని నిర్లక్ష్యం చేస్తే మూత్రపిండాలపై ప్రభావం చూపిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజూ కనీసం 8 గ్లాసుల వాటర్ తాగడం, దోసకాయ, పుచ్చకాయ తినడం, జ్యూస్‌లు తాగడం వంటివి చేయాలని సూచిస్తున్నారు. దాహం వేయకున్నా తరచుగా నీరు తాగాలని చెబుతున్నారు. చక్కెర పానీయాలు, ప్యాక్ చేసిన డ్రింక్స్ వినియోగాన్ని తగ్గించాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!