News March 21, 2025
NLG: అతడు అడవిని సృష్టించాడు!

ఎకరం పొలం ఉంటేనే ఏ పంట వేద్దాం, కౌలుకు ఇస్తే ఎంతొస్తది? అని లెక్కలేసుకునే రోజులివి. కానీ, హైవేకు ఆనుకొని ఉన్న 70 ఎకరాల భూమిలో మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఒక్కరోజులో జరిగిన పరిణామం కాదు. ఏకంగా 60 ఏళ్లు శ్రమించి 5 కోట్ల వరకు వృక్షాలను పెంచి ఆదర్శంగా నిలిచారు. ఆయనే మన రాఘవాపురం దుశ్చర్ల సత్యనారాయణ.
నేడు International Forest Day
Similar News
News January 15, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’ కలెక్షన్లు ఇవే!

చిరంజీవి కామెడీ, ఫ్యామిలీ డ్రామాతో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. మంగళవారం కంటే బుధవారం వసూళ్లు పెరిగినట్లు Sacnilk తెలిపింది. సోమవారం రిలీజైన ఈ మూవీ మూడు రోజుల్లో ఇండియా వ్యాప్తంగా రూ.79.60కోట్ల నెట్ కలెక్షన్లు సాధించినట్లు పేర్కొంది. కాగా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రూ.120+కోట్ల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు మేకర్స్ వెల్లడించిన విషయం తెలిసిందే.
News January 15, 2026
ఖమ్మం: వైద్య సేవలకు ఊతం

ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత విస్తృతం కానున్నాయి. కొత్తగా పది మంది ల్యాబ్ టెక్నీషియన్లను కేటాయించారు. నూతనంగా ఎంపికైన వీరు బుధవారం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నరేందర్‌కు నివేదించారు. వీరి రాకతో ల్యాబ్ సేవలు మరింత వేగంగా అందుతాయని సూపరింటెండెంట్ హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత తీరడమే కాకుండా, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు సకాలంలో అందుబాటులోకి రానున్నాయి.
News January 15, 2026
నల్గొండలో ఇక నవ శకం!

నల్గొండను నగరపాలక సంస్థగా మార్చడంతో పాలనలో కొత్త శకం ప్రారంభంకానుంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నల్లగొండ మునిసిపాలిటీగా కొనసాగగా, ఇకపై కార్పొరేషన్‌గా కొనసాగుతుంది. కార్పొరేషన్ కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతాయి. నగర ప్రథమ పౌరుడిగా మేయర్ కొనసాగుతారు. రాజకీయంగా మేయర్ పదవికి అత్యంత ప్రాధాన్యం ఉంటుంది. మంత్రులతో సరిసమానమైన ప్రోటోకాల్ ఉంటుంది.


