News March 21, 2025

కాకినాడ జిల్లాలో ఠారెత్తిస్తున్న ఎండలు

image

కాకినాడ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతుండటంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో పల్లెల్లోని వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కాగా కాకినాడ, పిఠాపురంలో అప్పుడే 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Similar News

News September 16, 2025

రేపు పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో వైద్య శిబిరం

image

పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో బుధవారం మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి డా. జి.నాగభూషణరావు మంగళవారం తెలిపారు. స్వస్థ నారి శక్తి పరివార్ అభియాన్‌లో భాగంగా ఈ క్యాంపును నిర్వహించనున్నట్లు వివరించారు. మహిళలు, పిల్లల అనారోగ్య సమస్యల పరిష్కారానికి ఇది చక్కని వేదికన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 16, 2025

అనకాపల్లి: రేషన్ షాపులకు ఈ-పాస్ పరికరాలు

image

జిల్లాలో రేషన్ షాపులకు అధునాతనమైన ఈ-పాస్ పరికరాలను అందజేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ జాహ్నవి తెలిపారు. కలెక్టరేట్లో డీలర్లకు మంగళవారం ఈ-పాస్ మిషన్లు అందజేశారు. వినియోగదారులకు మెరుగైన వేగవంతమైన సేవలు అందించినందుకు జిల్లాలో 1069 రేషన్ షాపులకు వీటిని అందజేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు.

News September 16, 2025

సిద్ధిపేట: ‘కేసులను త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి’

image

SC, ST కేసులలో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని సీపీ కమిషనర్ అనురాధ ACPకి సూచించారు. మంగళవారం ఏసీపీ ఆఫీసును సీపీ సందర్శించి రికార్డ్స్, క్రైమ్ ఫైల్స్ తనిఖీ చేశారు. పెండింగ్‌లో ఉన్న OE త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఏసీపీ రవీందర్ రెడ్డి టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ ఎస్బీ ఇన్స్పెక్టర్ కిరణ్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గౌడ్, సీసీఆర్పీ ఇన్స్పెక్టర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.