News March 21, 2025

విద్యుత్ ఛార్జీల పెంపుపై UPDATE

image

TG: విద్యుత్ ఛార్జీల పెంపుపై TGSPDCL సీఎండీ ముషారఫ్ ఫరూఖీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది ఛార్జీల పెంపునకు ప్రతిపాదించట్లేదని తెలిపారు. విద్యుత్ నియంత్రణ భవన్‌లో ఈఆర్సీ ఛైర్మన్ అధ్యక్షతన బహిరంగ విచారణ జరిగింది. టీజీఎస్పీడీసీఎల్ ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ప్రతిపాదనలపై జరిగిన విచారణకు సీఎండీ, జేఎండీ శ్రీనివాస్ హాజరయ్యారు. కాగా నిన్న ఎన్పీడీసీఎల్ కూడా ఛార్జీలు పెంపునకు ప్రతిపాదించట్లేదని తెలిపింది.

Similar News

News March 31, 2025

పెరిగిన బంగారం ధరలు

image

రెండ్రోజులుగా నిలకడగా ఉన్న బంగారం ధరలు నేడు పెరిగాయి. హైదరాబాద్‌ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పెరిగి రూ.91,190గా ఉంది. అటు 22 క్యారెట్ల పసిడి రూ.650 ఎగిసి రూ.84,250గా విక్రయిస్తున్నారు. గత పది రోజుల్లో బంగారంపై ఇది రెండో అత్యధిక పెరుగుదల. మరోవైపు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ ధర రూ.1,13,000గా విక్రయాలు జరుగుతున్నాయి.

News March 31, 2025

కాంగ్రెస్ ప్రభుత్వంపై బండి ఫైర్

image

తెలంగాణలో హరిత విధ్వంసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కాంగ్రెస్, BRS ఒక్కటేనని దుయ్యబట్టారు. గతంలో BRS హయాంలో కాళేశ్వరం నిర్మాణానికి 25 లక్షల చెట్లను తొలగించారన్నారు. ఇప్పుడు గచ్చిబౌలిలోని HCUలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని నాశనం చేస్తోందని ఫైరయ్యారు. అటవీ మాఫియాలో తెలంగాణ బందీ అయిందన్నారు. గొడ్డలి మారలేదని, పట్టిన చేతులు మారాయని విమర్శించారు.

News March 31, 2025

నా కొడుకు ఎవరినీ మోసం చేయలేదు: దర్శకుడి తల్లి ఆవేదన

image

‘L2:ఎంపురాన్’ మూవీలోని సన్నివేశాలు వివాదానికి దారి తీయడంపై దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తల్లి మల్లిక స్పందించారు. ఈ సినిమా విషయంలో పృథ్వీరాజ్‌ను అనవసరంగా నిందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును బలిపశువును చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. పృథ్వీరాజ్ ఎవ్వరినీ మోసం చేయలేదని, చేయబోరని చెప్పారు. సినిమా స్క్రిప్ట్ విషయంలో తప్పులుంటే అందరి బాధ్యత ఉంటుందన్నారు.

error: Content is protected !!