News March 21, 2025
మంత్రి ఫరూక్ సతీమణి మృతికి సీఎం, డిప్యూటీ సీఎం సంతాపం

మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ సతీమణి షహనాజ్ మృతికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం వపన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. షహనాజ్ మృతితో విషాదంలో ఉన్న ఫరూక్ కుటుంబానికి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సానుభూతిని తెలిపారు. కాగా, కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఉన్న ఆమె ఇవాళ హైదరాబాద్‌లోని వారి నివాసంలో మృతిచెందారు.
Similar News
News March 31, 2025
రంజాన్ మాసం ముగిసింది.. ఈద్ ముబారక్..!

29 రోజుల పాటు సాగిన పవిత్ర రంజాన్ మాసం ముగియడంతో ముస్లిం సోదరులు నేడు ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్ పండుగ)ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఈద్గాలు ప్రత్యేకంగా అలంకరించబడ్డాయి. రంజాన్ మాసం ఆధ్యాత్మిక చింతనకు, దానధర్మాలకు, ఉపవాసాలకు ప్రాధాన్యతనిచ్చింది. ఈ 29 రోజుల పాటు ముస్లింలు కఠిన నియమాలను పాటిస్తూ అల్లాహ్ పట్ల తమ భక్తిని చాటుకున్నారు. నేటి పండుగతో ఈ పవిత్ర మాసం ముగియనుంది.
News March 31, 2025
అల్లవరం: బ్రిడ్జి పైనుంచి దూకేసిన వ్యక్తి గల్లంతు

అల్లవరం మండలం బోడసకుర్రు- పాశర్లపూడి గ్రామాల మధ్యలోని వైనతేయ వారధిపై నుంచి దూకి ఆదివారం రాత్రి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అమలాపురం నుంచి ఓ కారులో వచ్చిన వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకేశాడని స్థానికులు తెలిపారు. అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ ప్రాంతం వస్తుంది. దీంతో అల్లవరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 31, 2025
MBNR: సర్వం సిద్ధం.. నేడే రంజాన్ పండుగ

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాత్రి నెలవంక కనిపించడంతో నేడు ముస్లింలు రంజాన్(ఈద్-ఉల్-ఫితర్) నిర్వహించుకోనున్నారు. ఇప్పటికే ఈద్గాలు, మసీదుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పలు ఈద్గాల దగ్గర పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించి, భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత 30 రోజులుగా దీక్షలు చేస్తున్న ముస్లింలు నెల వంక కనిపించటంతో ఆనందోత్సవాలు వ్యక్తం చేస్తూ చాంద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.