News March 21, 2025
IPL కామెంటేటర్‌గా ఇండియన్ అంపైర్

భారత్‌కు చెందిన అంపైర్ అనిల్ చౌదరి రిటైర్మెంట్ ప్రకటించారు. ఇక నుంచి కామెంటేటర్‌గా కొనసాగనున్నారు. ఢిల్లీకి చెందిన ఆయన 2013-2025 వరకు 12 టెస్టులు, 49 ODIs, 64 T20s, 131 IPL, 91 ఫస్ట్ క్లాస్, 114 లిస్ట్-A మ్యాచులకు అంపైరింగ్ చేశారు. ఇలా అంతర్జాతీయ మ్యాచులకు అంపైర్‌గా చేసి ఫుల్ టైమ్ కామెంటేటర్‌గా మారిన తొలి భారత అంపైర్‌గా నిలిచారు. ఇప్పుడు IPLలో హర్యాన్వి, హిందీలో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు.
Similar News
News March 31, 2025
బెట్టింగ్ యాప్స్.. సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు

TG: బెట్టింగ్ యాప్స్ వ్యవహరంపై ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ ప్రధాన అధికారిగా ఐజీ రమేశ్‌ను నియమించారు. ఇందులో సభ్యులుగా ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మీ, అదనపు ఎస్పీలు చంద్రకాంత్, శంకర్‌ను పేర్కొన్నారు. ఇప్పటికే 25 సెలబ్రిటీలపై పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవ్వగా ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది.
News March 31, 2025
రంజాన్ స్పెషల్.. పసందైన విందు

రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది ముస్లిం సోదరులు ఇచ్చే విందు. మతాలకు అతీతంగా స్నేహితులు, సన్నిహితులను తమ ఇళ్లకు పిలిచి పసందైన చికెన్ బిర్యానీ వడ్డిస్తారు. ఆ తర్వాత తియ్యటి షేమియా తినిపిస్తారు. అనంతరం ఆత్మీయంగా హత్తుకుని పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మరి మీకూ ముస్లిం స్నేహితులు ఉన్నారా? ఈద్ సందర్భంగా మిమ్మల్ని విందుకు ఆహ్వానించారా? కామెంట్ చేయండి.
News March 31, 2025
ముస్లింలకు PM మోదీ ఈద్-ఉల్-ఫితర్ విషెస్

దేశంలోని ముస్లింలకు PM నరేంద్ర మోదీ ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరిలో శాంతి, దయాగుణం పెంపొందాలన్నారు. చేపట్టే ప్రతి పనిలోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు. మరోవైపు దేశంలోని అన్ని పాంతాల్లో ముస్లింలు ఈద్గాలకు చేరుకొని పవిత్ర రంజాన్ ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆలింగనం చేసుకొని ఒకరికొకరు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు.