News March 21, 2025

పరీక్ష కేంద్రాలను సందర్శించిన ఆదిలాబాద్ కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ రాజర్షి షా సందర్శించారు. పలు పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. కలెక్టర్ వెంట శిక్షణ కలెక్టర్ అభిగ్యాన్, డీఈఓ ప్రణీత తదితరులు ఉన్నారు.

Similar News

News March 22, 2025

ఆదిలాబాద్‌: ఈ నెల 24న JOB MELA

image

ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్‌లో ఈ నెల 24న TSKC ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత, TSKC కోఆర్డినేటర్ డా.శ్రావణి, ప్లేస్మెంట్ సెల్ కోఆర్డినేటర్ మంజుల తెలిపారు. HDFC Bank & Axis Bankలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయన్నారు. ఏదైనా డిగ్రీ ఉండి 30ఏళ్లలోపు వయస్సు వారు అర్హులని పేర్కొన్నారు.

News March 22, 2025

తలమడుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ADB జిల్లా తలమడుగు మండలం సుంకిడిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన కుమ్మరి లింగన్న(48) ఐదెకరాల్లో పత్తి పంట వేశాడు. రెండేళ్లుగా పంట దిగుబడి రాకపోవడంతో సుమారు రూ.3 లక్షల వరకు అప్పులయ్యాయి. దీంతో పొలంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య లక్ష్మీ, ఇద్దరు కుమారులున్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News March 22, 2025

రాత్రి ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం

image

ఆదిలాబాద్ జిల్లాలో రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మావల సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి బైక్, లారీ, కారు ఇలా ఒకదానినొకటి ఢీకొన్నాయి. గమనించిన స్థానికులు గాయపడ్డ వారిని అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తున్న దేవేందర్‌గా ఒకరిని గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!