News March 21, 2025

MNCL: పుట్టెడు దుఃఖంలోనూ పది పరీక్ష రాసింది..!

image

కన్న తండ్రి మరణం.. మరోవైపు పరీక్ష.. బాధనంతటిని దిగమింగుకొని పరీక్ష రాసింది ఆమె. మనోధైర్యంతో పరీక్షాకేంద్రానికి వెళ్లి కన్నీటిచుక్కలను అక్షరాలుగా మలిచింది విద్యార్థిని శ్రీలత. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం ముత్తాపూర్‌కు చెందిన మంచర్ల మల్లయ్య(62) గురువారం రాత్రి చనిపోయారు. ఆయన కూతురు శ్రీలత బాధలో కుటుంబీకులు ఇచ్చిన ధైర్యంతో పరీక్ష రాసొచ్చింది. దుఃఖంలోనూ పరీక్ష రాసిన ఆమె ఎంతో గ్రేట్ కదా..!

Similar News

News March 31, 2025

లావేరు: జిరాక్స్ షాప్ యజమానికి రూ.36 లక్షల పన్ను నోటీసు

image

లావేరు(M) భరణికానికి చెందిన జిరాక్స్ షాపు యజమాని ఏ.హరికృష్ణకు ఒంగోలుకు సంబంధించిన GST డిప్యూటీ సహ కమిషనర్ కార్యాలయం నుంచి నోటీసులు జారీ అయ్యాయి. రూ.36,13,000 పన్ను బకాయి ఉన్నట్లుగా నోటీసులో ఉండటంతో అతను కంగుతిన్నాడు. తాను ఒంగోల్లో ఏ వ్యాపారం చేయలేదని, గతంలో బార్‌లో పని చేశానని పేర్కొన్నారు. అయితే ఒంగోల్లో హరికృష్ణ పేరు మీద హనుమాన్ ట్రేడర్స్ పేరుతో జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించారు.

News March 31, 2025

గుడివాడ: కొడాలి నానితో పాటు ముంబై వెళ్లింది వీరే.!

image

గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక విమానంలో సోమవారం హైదరాబాద్ నుంచి ముంబైకి తరలించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు కొడాలి అనుపమ, కొడాలి నాగేశ్వరరావు, ఎన్‌ఎస్ రెడ్డి, శివకుమార్ అరెకపూడు, ప్రియాంక ఫెర్నాండేజ్, ఆకాంక్ష చోప్రా, కోనేరు రాజ్యలక్ష్మిలు కూడా ముంబై వెళ్లారు. 

News March 31, 2025

వికారాబాద్: రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన స్పీకర్

image

రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా వికారాబాద్ పట్టణం పరిధిలోని ఆలంపల్లి ఆలం షాహి దర్గా వద్ద ముస్లిం సోదరులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. వికారాబాద్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, శ్రీనివాస్ ముదిరాజ్, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!