News March 21, 2025
నందనవనంగా అమరావతిని మార్చుకుందాం

AP రాజధానిగా అమరావతి రూపుదిద్దుకుంటోంది. దాదాపు 30 వేల ఎకరాల్లో భారీ ప్రాజెక్టుల సమాహారం ఇది. అయితే మహానగరంగా ఎదిగే ఏ ప్రాంతమైనా ఎదుర్కొనే ప్రధాన సమస్య పర్యావరణం. అందుకు ప్రభుత్వమే కాదు మనమూ నైతిక బాధ్యత వహించాలి. ప్రకృతితో స్నేహం చేస్తూ ఇంటికో చెట్టు పెంచాలి. ప్రకృతి ఒడిలో ఓలలాడేలా, పచ్చదనం విరబూసే నందనవనంలా అమరావతిని అలంకరించాలి. మీరేమంటారు.
నేడు ప్రపంచ అటవీ దినోత్సవం.
Similar News
News February 24, 2026
HYD: ఈ ప్రాంతాల్లో నిన్నటి నుంచి వర్షం

GHMC పరిధిలో సోమవారం రాత్రి వరకు పలుచోట్ల వర్షం కురిసింది. తెల్లవారుజాము నుంచి శివారు పెద్దఅంబర్‌పేట్, ఇబ్రహీంపట్నం పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. నిన్న హస్తినాపురంలో 17.5MM, సులేమాన్‌నగర్‌లో 14.5MM, అత్తాపూర్ 13.5 MM వర్షం కురిసింది. వనస్థలిపురం ఎన్‌జీఓకాలనీ, శాస్త్రిపురం, రాజేంద్రనగర్‌లో 12 MM చొప్పున, సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ వద్ద 9.3MM వర్షపాతం నమోదైనట్లుగా TGDPS తెలిపింది.
News February 24, 2026
WGL: ఇంటర్ పరీక్షలు.. పేపర్ లీకైతే ఇట్టే తెలిసిపోతుంది..!

ఉమ్మడి WGLలో ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఈసారి ఆధునిక సాంకేతికతకు ప్రాధాన్యం ఇచ్చారు. విద్యార్థుల హాల్ టికెట్లపై ముద్రించిన QR కోడ్ ద్వారా ఎగ్జామ్ సెంటర్‌ను సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించారు. ప్రశ్నాపత్రాలపై కూడా క్యూఆర్ కోడ్ ప్రింట్ చేయడంతో పేపర్ లీక్ ఘటనలు జరిగితే సదరు కేంద్రాన్ని వెంటనే గుర్తించవచ్చు. పరీక్షా కేంద్రాల్లో CCTV పర్యవేక్షణతో పాటు ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లు తనిఖీలు చేయనున్నాయి.
News February 24, 2026
KMR: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం జంగంపల్లి శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజు (27) అనే యువకుడు మృతి చెందాడు. బైకుపై గ్రామానికి వస్తుండగా జాతీయ రహదారిపై అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొన్నాడని స్థానికులు తెలిపారు. తీవ్ర గాయాలైన రాజును ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.


