News March 21, 2025
రామచంద్రపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఆర్సీపురంలో ఘోర రోడ్డు ప్రమాద సంఘటన రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎలక్ట్రికల్ వెహికల్ ను ఆర్ఎంసి వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఎలక్ట్రికల్ వెహికల్ నడిపిస్తున్న సాదు రవితేజ (36) తలపై నుంచి వాహనం పోవడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదుతో రామచంద్రపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 31, 2025
ఆసిఫాబాద్ జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

శాంతిభద్రతల దృష్ట్యా జిల్లాలో ఏప్రిల్ 30వ తేదీ వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డీఎస్పీ లేదా ఆపై పోలీస్ ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి సమావేశాలు, ధర్నాలు, ఊరేగింపులు, సభలు నిర్వహించినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు.
News March 31, 2025
నేటితో ముగియనున్న కొమ్మాల జాతర

వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర హోలితో ప్రారంభమై ఉగాది పండగ సందర్భంగా నేడు కొత్త సాలుతో ముగుస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం హుండీ ఆదాయం ఎక్కువగా వచ్చిందని పేర్కొన్నారు.
News March 31, 2025
కాకాణి గోవర్ధన్‌రెడ్డికి మరోసారి నోటీసులు

AP: వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి <<15944206>>నోటీసులు<<>> జారీ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ విషయంలో ఇవాళ విచారణకు రావాలని నిన్న నోటీసులు ఇవ్వగా ఆయన హాజరు కాలేదు. దీంతో రేపు ఉదయం 11గంటలకు విచారణకు రావాలని హైదరాబాద్‌లోని ఆయన ఇంట్లో నోటీసులు ఇచ్చారు. రేపు కూడా కాకాణి విచారణకు గైర్హాజరైతే చట్టపరంగా చర్యలు ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.