News March 21, 2025
పిఎంశ్రీకి జిల్లాలో 40 పాఠశాలలు ఎంపిక: DEO

పీఎంశ్రీ పథకంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో 40 ప్రభుత్వ పాఠశాలలు ఎంపిక అయ్యాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. ఏడు విడతల్లో మొత్తం 40 స్కూళ్లు ఎంపికైనట్లు చెప్పారు. ఎంపికైన పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈనెల 25లోగా https://pmshrischools.education.gov.in వెబ్ సైట్లో నమోదు చేయాలని సూచించారు.
Similar News
News January 23, 2026
నాగర్‌కర్నూల్ జిల్లాలో సమృద్ధిగా యూరియా నిల్వలు

నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రస్తుతం 992 టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఈ నెలలో అదనంగా 3,026 టన్నుల సరఫరా రానుందని పేర్కొన్నారు. ఇప్పటికే 22,175 టన్నుల యూరియా పంపిణీ జరిగిందని, నిల్వలు సరిపడా అందుబాటులో ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
News January 23, 2026
టాస్ గెలిచిన భారత్

న్యూజిలాండ్‌తో రెండో టీ20లో భారత కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. జట్టులో 2 మార్పులు జరిగాయి. అక్షర్, బుమ్రాకి రెస్ట్ ఇచ్చి వారి స్థానంలో కుల్దీప్, హర్షిత్ రాణాను తీసుకున్నారు.
IND: శాంసన్, అభిషేక్, ఇషాన్, సూర్య, హార్దిక్, దూబే, రింకూ సింగ్, హర్షిత్, అర్ష్‌దీప్, కుల్దీప్, వరుణ్.
NZ: కాన్వే, సీఫర్ట్, రచిన్, ఫిలిప్స్, చాప్‌మన్, మిచెల్, సాంట్నర్, ఫౌల్క్స్, హెన్రీ, సోథీ, జాకబ్.
News January 23, 2026
తులసిమతి మురుగేషన్‌కు మూడు బంగారు పతకాలు

కైరోలో జరిగిన ఈజిప్ట్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్ పోటీల్లో భారత్‌కు చెందిన ప్లేయర్ తులసిమతి మూడు బంగారు పతకాలు తన ఖాతాలో వేసుకున్నారు. తమిళనాడుకు చెందిన తులసి ఏప్రిల్ 11, 2002లో జన్మించారు. తులసి ఎడమచేతికి పూర్తి వైకల్యం ఉన్నా దాన్ని అధిగమించి ఏడేళ్ల వయసులో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించారు. ఇప్పటి వరకు అనేక పతకాలు గెలుచుకున్న ఆమె ఖాతాలో పారిస్ పారాలింపిక్స్ రజత పతకం కూడా ఉంది.


