News March 21, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ధరలు ఇలా..

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. తేజ మిర్చి క్వింటాకు నిన్న రూ.12,700 ధర రాగా.. నేడు రూ.13,200 పలికింది. 341 రకం మిర్చికి నిన్న రూ.13,000 ధర రాగా ఈరోజు రూ.12,800కి పడిపోయింది. అలాగే వండర్ హాట్(WH) మిర్చి క్వింటా నిన్న రూ.15,500 ధర పలకగా ఈరోజు రూ.14,800కి పతనమైనట్లు వ్యాపారులు తెలిపారు.

Similar News

News November 7, 2025

వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

image

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.

News November 7, 2025

దుగ్గిరాల పసుపు యార్డులో ధరలు ఇలా..!

image

దుగ్గిరాల యార్డు పసుపుకు పెట్టింది పేరు. అయితే పసుపు యార్డులో ధరలు గురువారం జరిగిన వేలంలో ఈ విధంగా నమోదయ్యాయి. కొమ్ములు క్వింటాకు కనిష్ఠ ధర రూ.10,800, గరిష్ఠ ధర రూ.12,500, మోడల్ ధర రూ.12,500 పలికాయి. కాయ క్వింటాల్‌కు కనిష్ఠ ధర రూ.11,800, గరిష్ఠ ధర రూ.12,400, మోడల్ ధర రూ.12,400 పలకగా, మొత్తం 218 బస్తాల పసుపును రైతులు వ్యాపారులకు విక్రయించారని సిబ్బంది చెప్పారు.

News November 7, 2025

వనపర్తి డీఎంహెచ్‌ఓ శ్రీనివాసులు బదిలీ

image

వనపర్తి జిల్లా వైద్యాధికారి (DMHO) శ్రీనివాసులును ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆయనకు నారాయణపేట జిల్లా వైద్య కళాశాల సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓగా పదోన్నతి కల్పించారు. ప్రోగ్రాం అధికారి సాయినాథ్ రెడ్డిని ఇన్చార్జి జిల్లా వైద్యాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.