News March 21, 2025
‘యానిమల్’ లుక్‌లో ధోనీ.. భారీ రెమ్యునరేషన్!

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ, మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబోలో తెరకెక్కిన ఈ-సైకిల్ <<15801433>>యాడ్<<>> భారీ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ యాడ్ కోసం వీరిద్దరూ భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ యాడ్ షూట్‌కు ధోనీ రూ.8 కోట్లు తీసుకున్నారని, సందీప్ రూ.5 కోట్లు పొందినట్లు ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ యాడ్‌పై ఆ సైకిల్ కంపెనీ సీఈవో కునాల్ కూడా సంతృప్తి వ్యక్తం చేశారు.
Similar News
News March 31, 2025
ఆయుధాలు పట్టండి.. మద్దతుదారులకు హమాస్ పిలుపు

ప్రపంచవ్యాప్తంగా తమ మద్దతుదారులందరూ ఆయుధాల్ని చేపట్టాలని హమాస్ పిలుపునిచ్చింది. గాజాలో ఉన్న 20లక్షల పైచిలుకు ప్రజల్ని అక్కడి నుంచి బయటికి తరలించాలన్న ట్రంప్ ప్రణాళికను భగ్నం చేయాలని పేర్కొంది. ‘ఓ వైపు ఊచకోత, మరోవైపు ఆకలితో గాజా పౌరుల్ని చంపాలని ట్రంప్ ప్లాన్ వేస్తున్నారు. రాయి నుంచి బాంబు దాకా ఏదైనా చేతపట్టండి. ఈ కుట్రను అడ్డుకోండి’ అని స్పష్టం చేసింది.
News March 31, 2025
నరికి డ్రమ్‌లో వేస్తా.. భర్తకు ఓ భార్య బెదిరింపు!

మీరట్‌లో ఓ భర్తను <<15809063>>భార్య ముక్కలు చేసి డ్రమ్‌లో వేసిన <<>>సంగతి తెలిసిందే. తననూ అలాగే చంపుతానని భార్య బెదిరిస్తోందంటూ UPలో ధర్మేంద్ర అనే భర్త పోలీసుల్ని ఆశ్రయించారు. ‘నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రశ్నించానని నన్ను కొడుతోంది. చంపేస్తాంటోంది’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆరోపణల్ని భార్య ఖండించారు. భర్త తన చెల్లెలిపై కన్నేశారని, ఆమెతో పెళ్లి కోసం తనపై నిందలు వేస్తున్నారని ఎదురు ఆరోపించారు.
News March 31, 2025
అన్యాయాలను ప్రశ్నిస్తే చంపేస్తారా?: YS జగన్ ఫైర్

AP: శ్రీసత్యసాయి(D) రాప్తాడులో YCP కార్యకర్త కురుబ లింగమయ్య హత్యను మాజీ సీఎం జగన్ ఖండించారు. వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. అధికార పార్టీ అన్యాయాలను ప్రశ్నించినందుకు BC కార్యకర్తను TDP నేతలు పొట్టనపెట్టుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని, పోలీసులు కూటమి నేతలతో కుమ్మక్కయ్యారని దుయ్యబట్టారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు.