News March 21, 2025

ఎన్నాళ్లకెన్నాళ్లకో ఈ మురిపెం!

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడ్డాయి. ఈ వారం వరుసగా 5 సెషన్లలోనూ అదరగొట్టాయి. కొన్ని నెలల తర్వాత బెంచ్‌మార్క్ సూచీలు ఒక వారమంతా లాభపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. గత ఏడాది నవంబర్ నాటి పుల్‌బ్యాక్ ర్యాలీలో చివరిసారిగా ఈ ఫీట్ నమోదైంది. NOV 29 నుంచి DEC 5 వరకు సూచీలు వరుసగా ఎగిశాయి. నిఫ్టీ ప్రస్తుత 23,300 స్థాయిలో కన్సాలిడేట్ అయితే మార్కెట్ వర్గాల్లో పాజిటివ్ సెంటిమెంటు మరింత బలపడుతుంది.

Similar News

News November 5, 2025

వరి కోత అనంతరం తీసుకోవలసిన జాగ్రత్తలు

image

వరిని నూర్చేటప్పుడు వేర్వేరు రకాల ధాన్యం కలవకుండా జాగ్రత్త పడాలి. నూర్చిన ధాన్యాన్ని శుభ్రంగా తూర్పారబోసి చెత్త, తాలు, మట్టి బెడ్డలను ఏరేయాలి. చౌడు నేలల్లో పండించిన ధాన్యాన్ని, చీడపీడలు ఆశించి రంగు మారిన ధాన్యాన్ని మంచి ధాన్యంతో కలపకూడదు. తూర్పార బెట్టిన ధాన్యంలో మట్టి గడ్డలు, గడ్డి, కలుపు విత్తనాలు, మొక్కల అవశేషాలు లేకుండా చూడాలి. ఇలా శుభ్రం చేసిన ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉండి మంచి ధర వస్తుంది.

News November 5, 2025

‘ఇద్దరు పిల్లల’ నిబంధన ఎత్తివేత.. నేడు ఉత్తర్వులు

image

TG: స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను ఎత్తివేసే ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణుదేశ్ ఆమోదం తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇద్దరికంటే ఎక్కువ సంతానం ఉంటే పోటీకి అనర్హులుగా పేర్కొంటూ చేసిన చట్టం 1995 నుంచి అమల్లో ఉంది. తాజా నిర్ణయంతో పంచాయతీ, MPTC, ZPTC, పురపాలక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్నవారూ పోటీ చేసేందుకు వీలు కలుగుతుంది.

News November 5, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంతంటే?

image

కార్తీక పౌర్ణమి వేళ బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనాన్నిచ్చాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.980 తగ్గి రూ.1,21,480కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.900 పతనమై రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ. 2,000 తగ్గి రూ. 1,63,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.