News March 21, 2025
మహబూబ్‌నగర్: ‘రక్షణ చర్యలు చేపట్టని విద్యుత్ శాఖ’

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో ట్రాన్స్‌ఫార్మర్లకు చుట్టూ కంచెలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రస్తుతం అవి ప్రమాదకరంగా మారాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పట్టణంలోని బండమీదిపల్లి, తెలంగాణ చౌరస్తా, పోలీస్ లైన్ తదితర జనావాసాలు,స్కూళ్లు ఉన్న ప్రాంతాల్లో రహదారులకు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయన్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News April 1, 2025
MBNR: తప్పుడు కేసులకు భయపడొద్దు: మాజీ మంత్రి

తప్పుడు కేసులకు భయపడొద్దని, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాసానిపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నేత రవి నేరంలో ప్రమేయం లేకున్నా తప్పుడు కేసు నమోదు చేశారని ఆయన అన్నారు. జైలుకి వెళ్లి బెయిల్‌పై బయటికి వచ్చిన ఆయనను ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.
News March 31, 2025
మహబూబ్‌నగర్: రంజాన్ పండుగ భద్రతను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యం, శాంతియుతం,ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ, అత్యవసర సేవల ఏర్పాట్లు ఈద్గా, మసీదులు ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బందోబస్తు అంశాలపై అధికారులతో సమీక్షించారు.
News March 31, 2025
మహబూబ్‌నగర్: భారీ ధర్నాకు బీసీ సంఘం: గోనెల శ్రీనివాసులు

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన 42 శాతం రిజర్వేషన్లను, కేంద్ర ప్రభుత్వం కూడా పార్లమెంటులో అమలు చేయాలని బీసీ సంఘం డిమాండ్ చేసింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి ఏప్రిల్ 2వ తారీఖున ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర జరిగే ధర్నా కార్యక్రమానికి బీసీ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోనెల శ్రీనివాసులు, మైత్రి యాదయ్య ముదిరాజ్, మురళి తదితరులున్నారు.