News March 24, 2024
అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీత

TDP-జనసేన-BJP ఉమ్మడి అభ్యర్థిగా అరకు ఎంపీ స్థానానికి కొత్తపల్లి గీతను BJP అధిష్ఠానం ఖరారు చేసింది. 2014లో లోక్‌సభ ఎన్నికల్లో వైసీపీ తరఫున అరకు ఎంపీగా కొత్తపల్లి గీత గెలిచింది. తరువాత వైసీపీని వీడి బీజేపీలో చేరారు. అదే సందర్భంలో ఆమెపై పలు అవినీతి ఆరోపణలు రాగా.. కోర్టులో సదరు అభియోగాలపై గీతకు అనుకూలంగా తీర్పు వచ్చింది. వైసీపీ తరఫున అరకు ఎంపీ అభ్యర్థిగా చెట్టి తనూజ రాణి బరిలో ఉన్నారు.
Similar News
News December 28, 2025
విశాఖ: ‘స్త్రీ శక్తి’ పథకం ఎఫెక్ట్.. 75%కి పెరిగిన మహిళా ప్రయాణికుల సంఖ్య

విశాఖపట్నం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు గాజువాక, స్టీల్ సిటీ డిపోలను శనివారం తనిఖీ చేశారు. ‘స్త్రీ శక్తి’ పథకంతో జిల్లాలో మహిళా ప్రయాణికుల సంఖ్య 75%కి పెరిగిందని, దీనివల్ల టికెట్ మిషన్ల ఛార్జింగ్ త్వరగా అయిపోతోందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి కండక్టర్లకు 20,000 mAh పవర్ బ్యాంక్స్ పంపిణీ చేశారు. డిప్యూటీ సీఎంఈ గంగాధర్ ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News December 28, 2025
విశాఖ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం రెవెన్యూ క్లీనిక్: కలెక్టర్

విశాఖ కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్‌లో రెవెన్యూకు సంబంధించిన అర్జీల విషయమై రెవెన్యూ క్లీనిక్‌ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 29వ తేదీ నుంచి ప్రతీ సోమవారం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలో గల అందరు రెవెన్యూ డివిజినల్ అధికారులు, ఎమ్మార్వోలు పాల్గొననున్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సూచించారు.
News December 28, 2025
భీమిలికి పెరుగుతున్న వలసలు

భీమిలిలో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని ప్రభుత్వం చెబుతుంటే.. వలస పక్షులు వాలుతున్నాయి. ఇంతకాలం పిల్లల చదువుల కోసం స్టీల్ సిటీకి వచ్చేవారు. ఇప్పుడు ఉపాధి పెరుగుతుండడంతో వలసలు మొదలయ్యాయి. ఉత్తరాంధ్రలో పారిశ్రామిక, ఐటీ పురోగతి పెరగడంతో మైగ్రేషన్ పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గాల్లో మొదటి రెండు స్థానాల్లో భీమిలి, గాజువాక నిలిచాయి.


